17, జూన్ 2018, ఆదివారం

నేలరాలు పూవులు ..
అమ్మ గర్బం నుంచి పేగు తెంచుకుని జారిన బిడ్డవలె ..
కొమ్మ నుండి వీడి నేలరాలు పూవులు ..
బిడ్డ తిరిగి అమ్మ గర్బంలోనికి వెళ్ళగలడా...
రాలి పడిన పూవు మరల కొమ్మకు అతుక్కోగలదా...
అమ్మ అయినా ...కొమ్మ అయినా..అమ్మ తనాన్ని అందించేవే ..
బంధం నిలుపుకోవలసినది నూరేళ్ళ జీవితానికి ముడిపడి ఉన్నది..
నేలను చీల్చుకుని మొలకెత్తిన విత్తనం ...
కొమ్మలుగా విస్తరించి రంగురంగుల పూలను పూయించి ..
సోయగాలతోనూ ..సుగంధాలతోనూ ...
చూసేవారి కనులకు ఆనందాలను ..
మనసుతో మైమరిచే వారికి ఆహ్లాదాన్ని అందించిన పూవులను
తిరిగి నేలతల్లి ఒడి చేరుస్తూ ..తృప్తి చెందుతుంది కాబోలు ...
ఎన్ని పూవులు రాలిపోతున్నా .. ఆ మొక్క మళ్ళి మళ్ళి పుష్పిస్తునే ఉంటుంది ..
ఆయుష్షు తక్కువయినా..అర్పించే తత్వం కలిగినవి పూవులు ..
అందుకే పూజా సామాగ్రిలో అగ్రస్తానాన్ని ఆక్రమించాయి..
తాము లేనిదే అలంకారము లేదు అన్న ధీమా కధూ పూవులది..
నేల రాలినా ఆ క్షణం....వాడని రాజసం ...వీడని పరిమళం ..
పూవులకు మాత్రమే సొంతమై ఉన్నది...
ఆత్మను వీడిన మనిషి శరీరం మాత్రం ..
చితిని చేరే పనికిరాని శవమై మిగులుతుంది..
మంచితనపు సుగంధంతో మనిషితనం విరబూస్తే...
కృష్ణుని సేవకు చేరిన నేలరాలిన పారిజాతమల్లే ..
అమరమై జీవితం ...తర తరాలకు ఆదర్శమయి నిలుస్తుంది..!!.
LikeShow More Reactions
Comment

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి