17, జూన్ 2018, ఆదివారం

పాపం కోకిల
ఆకులు రాలుస్తూ మోడుగా మిగులుతున్న కొమ్మలను చూస్తూ..
గూడు కరువైన కోయిలమ్మ ఎడారైనది బ్రతుకని మూగగా రోదిస్తూ
కాకమ్మ గూటిలో గుడ్లను పెట్టి తానెటో వెళ్ళిపోయింది..
రూపం కురూపి అయినా...గాత్రం కటోరమయినా...
చీ కాకి అని చీదరించుకునే పక్షి అయినా..
తనకున్న మంచి మనసుతో బేదాలను మరచి పొదిగిన గుడ్లలోనుండి.
చిట్టి చిట్టి కోయిల పిల్లలు ..కాకమ్మ పిల్లలతో పాటు కీచు కిచుమంటూ..
అమ్మ కాని అమ్మ కాకమ్మ తెచ్చిన ఆహారం తింటూ పెరుగుతున్నాయి
చిగురులు తొడుగుతున్న మామిడి కొమ్మలపైకి ..
అప్పుడే వస్తున్న రెక్కలతో ఎగురుకుంటూ పోయి
తృప్తిగా మావిచిగురులను తిన్న పిల్ల కోయిల
కుహు..కుహు అంటూ. గానమందుకుంది..
శిశిరాన్ని వెనక్కి నెట్టుతూ వసంతుడు పరుగు పరుగున వస్తున్నాడు ..
ప్రచండ భానుడి తాపం పెరిగి..కాలం ఎండాకాలంలోకి వెళ్ళింది.,
మూడు కాలాలు ..ఆరు ఋతువులు..పన్నెండు నెలలు ..ఒక ఏడాది ..
చక్రబ్రమణంలో మార్పు లేదు..విశ్వంలో మార్పు లేదు..కానీ..
మనిషి మనుగడ సాగించే విదానంలో జరిగే మార్పులకి ..
పక్షి జాతి బలి అవుతూ..అంతరించి పోతుంది . ..
మధురమైన గాత్రంతో మనలను సన్మోహితులను చేసే కోయిలలు ..
అడవుల స్తానంలో వెలిసిన కాంక్రీట్ భవనాలలో గూళ్ళు పెట్టుకోలేక
“కోకిల “ ఇదే అంటూ కంప్యుటర్ లో కనిపించే బొమ్మలుగా మిగిలిపోతున్నాయి..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి