2, జులై 2016, శనివారం

చెలుని గురించి ఆలోచనలలో......
పల్లవి : రేయి నిదురోయినా...
చిరుగాలి సవ్వడులు మానిన
నా మనసుకు నిను తలచుటయె
ధ్యానము లే....ధ్యానములే....
చరణం : విరజాజి పూవులకేందుకో...
ఈ ఆరాటం ..
పందిరినిండా విరగ బూసి
మరుల సెగలు రేపుతున్నాయి.. . //రేయి//
చరణం : నీ కనులతో కలబడిన
నా కనులలో కలలు
నిజమైన పొదరింట
పండించే సిరి వెన్నెలలు ... //రేయి//
చరణం : పసిడి కాంతుల మిసిమి వన్నెలు
ఏ తుమ్మెద తాకని మకరందపుదొన్నెలు
అందిస్తా నీకే..తనివి తీరా..
అనురాగాపు లాలనల జోలలలో... //రేయి//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి