2, జులై 2016, శనివారం

పూల వనం....
గుడిలో వెలిగే దీపం పవిత్రతని సంతరించుకుంటూ...
భగవంతుని తన వెలుగులో చూపిస్తూ....
ఆ స్వామి కృపని మనపై ప్రసరించేలా చేస్తుంది..
నిర్జీవమైన శరీరాన్ని..వదిలి వెళ్ళిన ఆత్మను
దైవత్వంలో కలుపుతూ..తలవద్ద వెలుగే దీపం..
మనసులలోని దుఃఖపు ఛాయలకు ప్రతిరూపమవుతుంది..
శుభఫలితాల ప్రయోజనం కోసం ..గ్రహాలను శాంతింపజేయ ..
ఆజ్యం వేస్తూ ..అగ్ని దేవుని పూజించే ప్రక్రియే..హోమం...
పంచభూతాలలో అగ్ని ప్రదమ స్థానంగా నిలిచి
ఏడడుగుల అనుభందానికి సాక్షిగా ఉంటూ...ఆశిస్సులనందిస్తుంది..
మంటలు... మంటలు...ప్రతి మనుజుడిలోను లోలోన చెలరేగే మంటలు..
ఆకలి మంటలు ..క్రోదపు మంటలు...స్వార్ధపు మంటలు..
చివరకు చితిలోను..చెలరేగే మంటలు...
ప్రకోపిస్తే..దాహించివేస్తాయి...సమస్తాన్ని....సర్వస్వాన్ని..
సహనంతో ..సమన్వయంతో..శాంతపరుచుకుంటే..
జీవితం అవుతుంది....మంటలు లేని వెన్నెల పూలవనం...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి