24, డిసెంబర్ 2015, గురువారం

ఇంటింటా సంక్రాంతి ....

పైట చెంగు జారుతున్నా...
లెక్కచేయని కలికి తనం 
పరికిణి ఎగదోపిన జాణతనం
రంగరించి ..
విల్లులా వంచిన నడుముభారమవుతున్నా ....
వేళ్ళ సందులనుంచి ముగ్గు లతలు ..పూవులై ..
వాకిట్లో నిలుస్తుంటే ..
చూసే కనులకు సంక్రాంతి ... సంబరమే..

ధనుర్మాసపు చలి
లేత భానుని కిరణాల కాచుకుంటూ ..
మృదువుగా స్పర్సిస్తుంది ..
మావిడాకులపైనుండి ఊయలలూగుతూ...

గుమ్మడి పూలు సిగలో తురుముకొని
నవదాన్యాల నడుమ ..
పసుపు కుంకుమల పవిత్రతతో..
రేగిపండ్లు..చెరుకుముక్కల నైవేద్యాలతో..
ప్రతీ ముంగిలిలో ముత్తైదువులై నిలిచాయి గొబ్బెమ్మలు ... 
అన్నపూర్ణలని తలపిస్తూ...
ఇంటింటా సంక్రాంతి ఇదేనని తెలుపుతూ.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి