27, జనవరి 2014, సోమవారం

నాన్న !!

అమ్మ పాలు త్రాగి 
ఆకలి తీర్చుకున్నా..
నాన్న అనురాగాల లాలనలలో...
అన్నీ మరచి జీవించా......

చట్టి తల్లినైన నన్ను గాల్లొకెగరేస్తూ...
నా కిల కిల నవ్వుల్లో
తన వయసును మరచి 
నా అల్లరిలో పాలు పంచుకున్న నాన్న!

అడుగు..అడుగు కూ 
తన అరచేయి ఉంచి
తడబడు అడుగులను 
తప్పటడుగులు కానివ్వని నాన్న!

అ ఆ లు దిద్దిస్తూ......
నాకు తోలి గురువై 
అహర్నిశలు నా ఉన్నతిని కాంక్షిస్తూ
ఆత్మా స్తైర్యం నింపిన నాన్న!

ఎదిగిన నన్ను చూసి 
ఆడపిల్లనని గుర్తెరిగి 
తప్పక అప్పగింతలు చేసి 
కనుపాపల వెనుక ...
కంటి చెలమను దాచి ..
పంటి బిగువును ..
మీసాల పక్కకు నెట్టి
ఆలింగనంతో అభయ హస్తమిస్తూ 
వీడ్కోలు చెప్పిన నాన్న!

నా కంటి పొరల వెనుకే గానీ...
కనుల ముందుకు రాలేని 
లోకాలకు సాగిపోయే...నాన్న!

నేనాడపిల్లనే...చివరికి...
చితి పెట్టను కూడా..
పనికిరాకపోతినే....
నాన్నా....!!!

(సరిగ్గా...ఏడు సంవత్సారా ల క్రితం ఇదే రోజున నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు...అశ్రుతర్పిత నయనాలతో...)...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి