12, డిసెంబర్ 2014, శుక్రవారం

    పెద్ద బాలశిక్ష...
    అ ఆ లు నేర్పే..అమ్మ పెద్ద బాలశిక్ష ...
    ఆ బాలశిక్షను.ఔపోషణ పట్టి..
    అనురాగపు అమృతంతో రంగరించి......
    సంస్కారం అనే... ఉగ్గు చేసి....
    బిడ్డల కందిస్తుంది మాతృ మూర్తి...

    ఆడపిల్ల అని చులకన చేయక
    చెప్పించిన చదువులకు సార్ధకత చేకూర్చి
    మెట్టినింటను అభిమానాల పంటలే కాదు..
    అవగాహనల ఉపిరులతో ...
    స్వర్గం చేస్తుంది...ఇల్లాలై...
    పురాణాలు ..ఇతిహాసాల కాలము నుండి..
    చదువు అంటేనే.."సరస్వతీదేవి "
    శ్వేతాంబరి అయిన ఆ చల్లని తల్లి కూడా
    బ్రహ్మ దేవుని మానస చోరిణే (ఇల్లాలే ) కదా..
    చీకటిలో చిన్ని దీపం వెలుగే...
    గమ్యం చూపించేందుకు
    మార్గదర్శకమయినట్టు..
    ప్రతి ఇంటిలోనూ..
    చదువు కున్న ఇల్లాలు ఉంటె....
    ముల్లోకాలు ముచ్చటగా
    ముంగిటిలో రంగవల్లుల
    ఆనందాలని అందిస్తాయి అనడంలో..
    అతిశయోక్తి లేదు మరి..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి