12, డిసెంబర్ 2014, శుక్రవారం

    ఆనందాల హేళి..
    అదిగదిగో...రాలిపడుతున్నాయి...
    నక్షత్రాలు..చిక్కని .చీకటిలో...
    కావు..కావు ..అవి వెలుగు పూవులు.....
    అమావాస్య నాడైనా కురిసే. ..వెన్నెల ముద్దలేమో...

    కేరింతలతో..తుళ్ళింతలతో....గంతులు వేస్తూ..
    నింగిలోనికి ఎగసిన .. తారాజువ్వలని చూస్తూ..
    పసి మనసుల.. పసిడి పలుకులు...
    అమాయకత్వంలోని ఆమని అందాలే..మరి..
    విష్ణువక్షస్థలనివాసి అయిన లక్ష్మీదేవిని..
    భక్తి శ్రద్దలతో... అర్చలన పూజిస్తూ..ఆవాహనము చేసిన..
    కరుణావీక్షణములతో....అరుదెంచి...
    ఆశిస్సులందించే..అపురూపమయిన రోజు..ఈ దీపావళి రోజు..
    నరకాసురవధతో....ఆనాడు అసుర భాధలు తొలగ
    ప్రజలు సంబరాలతో... పండుగను చేసుకొనె..
    కాకరపువ్వొత్తుల కాంతులతో...చిటపటల
    చిచ్చుబుడ్ల సందడులతో...డమడమల బాంబుల మోతలతో..
    "అతి ఏదైనా అనర్ధానికి చేటే.."అన్న పెద్దల మాట..
    చద్దన్నం అని పారేయకుండా..వంటికి పట్టించుకుని...
    టపాసులను కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలతో..
    వాతావరణ కాలుష్యాన్ని నివారించ ప్రయత్నిస్తే..
    అవుతుంది ప్రతి "దీపావళి " ఆనందాల హేళి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి