12, డిసెంబర్ 2014, శుక్రవారం

    అవ్వ !
    అమ్మగా ఆయువు నిచ్చి...
    అన్నంపెట్టిన చేతులతోనే..
    భవిష్యత్తు గోడలకు పునాదివేసి...
    సురక్షిత రక్షణలో..
    బిడ్డలని ఉంచినా..
    వారి నిరాదరణకు...
    అభిమానం అడ్డువచ్చి.....
    అలవాటయిన పనేనని....
    మోపును బుజానికి ఎత్తుకొని..
    వంగిన నడుముతో...
    ముడుతల శరీరం సహకరించకున్నా...
    మసిబారిన చేతులలో...
    ఆత్మబలం కూడదీసుకొని...
    నీకు నీవుగా ... 
    జీవించాలనుకునే...అవ్వా!
    నిన్ను చూసి నేర్చుకోవాలి యువత...
    కష్టం అంటే...ఏమిటో..
    మసక బారిన నీ కన్నుల కాంతిలో....
    వెలుగుతున్న దివ్వెలవెలుగులో...
    గమ్యం వెతుకుక్కోవాలి..!
    నీ జీవితానుభవాల పాఠాశాలలో చేరి..
    బ్రతుకు చిత్రం వేసుకోవటం నేర్చుకోవాలి... !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి