4, జనవరి 2017, బుధవారం

************ఎంతబాగుండు.***************.
అలంకరణలో రాజసాన్ని అపాదించుకొని..
పగటివేళల్లో నక్షత్రమై భాసిస్తావు...వజ్రమా..
నీ జిలుగులకు బానిసలై..రాజ్యాలను..
కొల్లగొట్టుకున్న రాజులేందరో...చరిత్రలో...
నేలతల్లి గర్బంలో...మట్టి పొరలమద్య..
ఇరుక్కుపోయి...రాయివై దాగుంటావు..వజ్రమా..
నిన్ను పరి పరి విదాల సానబెట్టి..
కోతలు కోస్తారు ఈ మానవులు...నీకు జిలుగులనీయ..
నవ రత్నాలలో మేటి అనిపించుకొని...
పసిడి పొదుగులో ప్రకాశిస్తావు...వజ్రమా...
జాతక చక్రంలోని దోషాలకు..పరిహారముగా..
నీ మేలిమితో...చాటుకుంటావు నీ ప్రతిభను..
బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకన చేరి..
జన్మసార్ధకం చేసుకున్నావు.... వజ్రమా..
తిరుపతి వెంకన్న కిరిటాన కోటిప్రభలతో నిలిచి..
భక్తులకు దరిశనమిస్తూ...పాత్రవైనావు స్వామి కృపలో..
ప్రతిఫలిస్తే కాని...నీ ఉనికి నీకే తెలియదు...
అందుకే అయినావు అతి ముఖ్యభూమికవు..వజ్రమా..
వాడుకుంటారు ప్రతి చర్యలోనూ..నీ పేరును..అట్లాగనే..
ప్రతి ఒక్కరు..వజ్రం వలె ప్రతిభింబిస్తూఉంటే..ఎంతబాగుండు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి