27, సెప్టెంబర్ 2016, మంగళవారం

*******ఉయ్యాలో..ఉయ్యాలా..*********
ఉయ్యాలో..ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా...
బంగారు రంగులో ఉయ్యాలా ..పసుపు గౌరమ్మనే చెయ్యాలా..
గూనుగు పూలతో ఉయ్యాలా..అందంగ పేర్చాల ఉయ్యాలా..
బంతులు. చేమంతులు ,ఉయ్యాలా..
మల్లెలు ..  మందారాలు ఉయ్యాలా..
గుట్టగ పెర్చాలె ఉయ్యాలా..
రంగు రంగుల పూల బతుకమ్మ ఉయ్యాలా..
చల్లని తల్లి ఆ యమ్మ ఉయ్యాలా..
కన్నె పిల్లల కలలు తీర్చుతాదే ఉయ్యాలా..
ముత్తైదువుల పసుపు బొట్టవుతాదే ఉయ్యాలా..
వనితలందరూ ఉయ్యాలా...ఒక్కచోట చేరి ఉయ్యాలా..
ఊపాలే ఊపాలే ఉయ్యాలా...చేతులు ఊపాలే ఉయ్యాలా..
చప్పట్లు కొట్టలే ఉయ్యాలా...చుట్టురా తిరగాలే ఉయ్యాలా..
దుర్గమ్మ తల్లిని కొలవాలె ఉయ్యాలా..
మట్టి దీపమే పెట్టాలె ఉయ్యాలా..
పప్పు బెల్లాలు  ఉయ్యాల...
నైవేద్యమే  పెట్టాలి  ఉయ్యాలా...
కర్పూర హారతి ఇవ్వలే  ఉయ్యాలా..
బతుకమ్మ .. బతుకమ్మఅంటూ ఉయ్యాలా..
ఏటిలోన విడువాలే ఉయ్యాలా..
నీటి పైన తేలి ..ఆయమ్మ ఉయ్యాలా...
పోయి మల్లి ఏడాదికొచ్చునే ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..
మళ్ళి రావే తల్లి ఉయ్యాలా...మమ్ము సల్లంగ దీవించు ఉయ్యాలా..
తెలంగాణా తల్లికి ఉయ్యాలా...అడబిడ్డవే నీవు ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..
అమ్మలు అక్కలు  వదినెలు  చేల్లెండ్లు ..
బేదాలు మరచి  ఉయ్యాలా...
బతుకమ్మ  ఆడాలే ఉయ్యాలా..
ఉయ్యాలో..ఉయ్యాలా...బతుకమ్మా..ఆడాలా....ఉయ్యాలా...!!
No automatic alt text available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి