9, ఏప్రిల్ 2014, బుధవారం

.
శ్రీ రాముడు...

పుత్రకామేష్టి యాగ ఫలం వలన..రఘుకుల తిలకుడు పునర్వసు నక్షత్రాన జన్మించి ..
ముగ్గురు తల్లుల ముద్దుల తనయుడే కాక ముగ్గురు తమ్ముల అన్నగా
దశరధుని ప్రియ పుత్రునిగా ..దినదిన ప్రవర్ధ మానమవుతూ...సూర్య తేజంతో..
 ఆజానుబాహుడైనాడు ..నీల మేఘ శ్యాముడు ...ఆ రఘరాముడు...

సురాసురులు ..యక్షకిన్నెర మహోరగులకు కదలని శివ ధనుసును
విశ్వామిత్రుని అజ్ఞానుసారం ఆ ధనుస్సును ఒక్కచేతితో పట్టుకొని
ఎక్కుపెట్టినంతనే..పిడుగులాటి శబ్దంతో ...విరిగిపడిపోయింది....
ప్రమోదమైన మనసుతో...నునుసిగ్గుల సీత తన అనురాగాల మాలనలంకరించింది . .

ఆరిఆరని తాటాకుల పందిళ్ళు ..చిగురులు తొడిగిన లేతాకుపచ్చని మామిడి తోరణాలతో
వసంతానికి గుర్తుగా విచ్చుకున్న మల్లెపూల మకరద్వజాలు ...సువాసనల విందు చేస్తూ
కస్తూరి తిలకం పెట్టి  ..మణిబాసికం నుదుటను గట్టిన రామయ్య పెళ్లి కొడుకైతే...
సౌందర్యాలన్నీపోగై పుత్తడి బొమ్మైనట్లున్న జానకి పారాణిపాదాల పెళ్లి కూతురైంది..

పుష్పవర్షం కురుస్తుండగా దేవదుందుబుల మ్రోతతో ప్రాంగణమంతా ప్రతిద్వనించగా ..
మాంగళ్యధారణ ..ముత్యాల తలంబ్రాలతో..వధూవరులు ..కన్నుల పండుగే నాడు ..
వాడ వాడలా...సీతా రాముల కళ్యాణ వేడుకలే ..ఈ నాడు...
వడపప్పు పానకాల ప్రసాదాలతో...వేడుకల సంబరాలు ..

తండ్రిఆనతికై పదునాలుగు సంవత్సరాలు కారడవులకేగి...దుష్ట రాక్షసుల సంహరిస్తూ
సీతాపహరణం చేసిన  రావణుని వధించి..తిరిగి నవమి నాడు పట్టాబిశక్తుడైనాడు రాముడు!!
చైత్ర సుద్ద నవమి..జగత్ కల్యాణానికి ..ధర్మరక్షణకై ..విష్ణు మూర్తే స్వయంగా ..
మానవుడిగా జన్మించి తనయుడిగా ..అన్నగా ..భర్తగా ..మహారాజుగా ..అన్ని పాత్రలకు
తగిన న్యాయం చూపిస్తూ...మనిషిగా జన్మ సార్ధకం చేసుకొన ఆదర్శంగా నిలిచాడు ..శ్రీ రాముడు !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి