8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మాట్లాడే బొమ్మ.
మట్టిని తెచ్చావు..
నీటిని వేసి కలిపావు...
కాళ్ళ కింద వేసి తోక్కావు...
వేళ్ళ సందుల్లోంచి బయటికి వచ్చేలా..పిసికావు..
నీ ఉహలకి ప్రాణం పోసుకుంటూ...
మలిచావు అందమైన బొమ్మగా..
కొలిమిలో వేసి కాల్చావు...
మళ్ళి...చల్లార్చావు...
నీ మనసు దీరా చూసుకుంటూ..
రంగులను వేసి..మురిసిపోయవు..
మెరుపు బట్టలేసావు..పూసల దండలతో
ముస్తాబు చేసావు..
నీ ఇష్టాన్ని కళ్ళ ల్లోంచి కురిపిస్తూ..
తడిమి తడిమి చూస్తావు..
ఇన్ని చేశి నీవు...షో కేసులో ఉంచుతావు..
అలంకారానికి అందంగా ...
ఏళ్ళకి ఏళ్ళు గిదిచిపోతూ ఉంటాయి..
మారనిది బొమ్మ స్థానం మాత్రమే..
ప్రాణం లేదు..పలుకలేదు అనుకున్నా..
ఒక్కో సారి వాటికళ్ళల్లోకి చూస్తూ ఉంటె..
ఎన్నో ప్రశ్నలు వేస్తాయి..
మనలో చెలరేగిన ప్రశ్నలకి జవాబులూ చెపుతాయి...
అందుకే...బొమ్మకి ప్రాణం లేదు అనుకోవద్దు మరి..!!
******** **********

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి