8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఎన్నటికి కరగని కల

రతీదేవిని తలపించే ఆమెను చూసిన వేళ
మదిలో మన్మధ హేల..
రమణి వయ్యారాల సిరులను 
దోచుకోవాలనుకునే...మరుల గోల..
రమ్యమయిన తలపులలో
విహరింపజేయు విరహాగ్ని లీల..
రక్షణ కోల్పోతుందని యవ్వనం..
అలజడులపడు టేల...
రత్నాలు..మణిపూసల హారాల సింగారాలు
దాగినవి ఆమె చిరునవ్వుల ..
రవి కిరణాల వలె స్పృశించు
చూపులతూపులు కన్నుల..
రజిత మయమే ...
ముఖారవిందపు వెన్నెల ..
రక్కసి అయి కాలం .గడవకున్నది..
క్షణం యుగమై...ఏల...
రజనీకరుని కరుణయున్నను...
ఆమె హృది కరుగకున్నదేల..
రంగులమయమయిన వలపుల కలయికలతో
జీవితం అవుతుంది ఎన్నటికి కరగని కల..!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి