7, సెప్టెంబర్ 2017, గురువారం

నిజం ..కోట..****
సుస్థిర సామ్రజ్య స్థాపనకు రక్షగా
మహారాజుల దర్పానికి చిహ్నంగా
చరిత్రను చాటి చెపుతూ...
వందల సంవత్సరాలు గడుస్తున్నా..
శిధిలావస్థలోనూ చిత్రంగా నిలబడిననిజం .. కోట...
రాణివాసపు సిరులను..
దేవేరుల అంతరంగ అందాలను..
పదిలంగా దాచుకుంటూ..
వారి వారి అభిరుచులననుసరించి..
కళామతల్లులకు నీరజనాలర్పించి నిలిచిననిజం,,కోట..
శత్రుసైన్యాలను దరిచేర నివ్వకుండా..
చుట్టూ కందకం ఉండేదట నిండు నీళ్ళతో..
అయినా తాళ్ళతో కట్టిన ఉడుములను
కోటగోడ చివరి అంచులకు విసిరేవారట పట్టుకుని ఎక్కటానికి..
అమ్మమ్మ చెప్పే కథలకు నిదర్శనమైన నిజం ...కోట...
ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు..
ప్రతి రాజప్రాకారం..అద్భుతమైన కళలకు ఆలవాలం..
ప్రాంతాలవారిగా..చిత్ర విచిత్రమలుపులతో..
ఆనాటి చతురస్ర చైతన్యాన్ని చూస్తూ..
ఔరా ! అనిపించే అపురూప సందర్శన సంబరమైన నిజం ..కోట..
మట్టి రాళ్ళతో నిర్మితమైనా..కంచుకోటగా నిలిచి....
ఎత్తైన ప్రాకారాలు..బురుజులతో...
ప్రాచిన సంప్రదాయాల శోభితమై..
ప్రజలను రాజు పరిపాలిస్తే..
ఆ రాజునే పరిరక్షించడానికి కాపలాగా నిలిచిన నిజం ..కోట..
ప్రతి మనిషి తనకు తానే రక్షణకోటగా నిలిచి ...
ఆత్మస్థైర్యం ఆయుధంతో నిరాశ నిస్పృహలనబడే
శత్రులను చీల్చి చండాడి...మొక్కవోని ధీక్షతో..
అందిన అవకాశాన్నిఅందుకుంటూ..అనుకున్నగమ్యం చేరితే.
తనలోని రాజ్యానికి తానే మహారాజు కదా మరి..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి