19, మార్చి 2014, బుధవారం

హోళీ....


హోళీ.. హోళీల రంగ హోళీచమ్మకేళిల హోళీ.....జానపదాలు...జాలువారుతుండ
ఇంద్రధనుసు రంగులన్నీ ఇంటింట తెలియాడుచు ఆనందాలు నింపుతుండే...
జాతి మత బేదాలు మరచి ..స్నేహ హస్తం చాచుతూ.......
మానవ సంబంధాలను పెంచుతూ...సమసమాజమిదని చాటుతుండే..


కాముని దహనం చేసి...పున్నమి వెలుగుల పునీతులవుతూ...
పాల్గుణమాసం ఇదే....ఇక వీడ్కోలు...ఈ వత్సరానికని చెపుతూఉండే...
చైత్ర మాసపు శోభలకు స్వాగతం పలుకుతూ...రంగవల్లుల రంగులే...
చిన్న..పెద్దా..తారతమ్యాలను విడచి అల్లరిలో హద్దులు చెరిపేస్తూ ఉండే..

అలనాడు యమునాతటిపై..నల్లనివాడు ఆదమరచి మురళి మ్రోగించు చుండ
గడుసు గోపెమ్మలు అనేక వర్ణాలతో..గోపాలుని ముంచేసి పకపకమనుచుండే...
ఆ రాసకేళి ఘటణ వినుటకేంతో రసరమ్యభరితము..ఆ తన్మయత్వం తపోబలమై
మదిని మోహపరవశమొనరించ ఆ మాధవుని లీలలలో హృదయం తెలిపోతుండే..

పండుగ ఎప్పుడు జరగాలి సంతోషాల సరదాల జాతరలా...
విభేదాలకు తావివ్వని ...అంతరాలను చేదించి ...ఆప్యాయతలను
పెంచుకుంటూ.....అపార్ధాలకు సెలవు చెపుతూ..సన్నిహితత్వం...
సోదరబావం..మన స్వబావమని చాటుకుందాము...ఈ హోళీ మనదే ఇక..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి