3, మార్చి 2014, సోమవారం

పండుటాకు....

పండుటాకునని...
పనికి రాని దాన్నని...
విసిరి పారేసారు.......

ఇన్నాళ్ళు నా
పత్రహరితం తాగుతూ.
కొత్త చిగురులు తొడిగిన
కొమ్మ ...
నన్ను తనకు తానుగా..
రాల్చేసింది....

జీవం లేదని మాకు
అనుకుంటే..పొరపాటే...
ఒక సారి ముట్టుకొని చూడు..
పెళ పెళ మంటాము....
గుండెలు పగిలే ఘోషలె
వినిపిస్తాయి...

నిస్తేజమయినా...మాకు
జీవితానుభవం నేర్పిన పాఠాలు
భవితకు తెలియజేయాలనే...
తపనలతో...కంటి చెలమల తో
ఎదురు చూస్తూ ఉంటాం
వృద్దాశ్రమాలనయినా...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి