17, జూన్ 2018, ఆదివారం

పాపం కోకిల
ఆకులు రాలుస్తూ మోడుగా మిగులుతున్న కొమ్మలను చూస్తూ..
గూడు కరువైన కోయిలమ్మ ఎడారైనది బ్రతుకని మూగగా రోదిస్తూ
కాకమ్మ గూటిలో గుడ్లను పెట్టి తానెటో వెళ్ళిపోయింది..
రూపం కురూపి అయినా...గాత్రం కటోరమయినా...
చీ కాకి అని చీదరించుకునే పక్షి అయినా..
తనకున్న మంచి మనసుతో బేదాలను మరచి పొదిగిన గుడ్లలోనుండి.
చిట్టి చిట్టి కోయిల పిల్లలు ..కాకమ్మ పిల్లలతో పాటు కీచు కిచుమంటూ..
అమ్మ కాని అమ్మ కాకమ్మ తెచ్చిన ఆహారం తింటూ పెరుగుతున్నాయి
చిగురులు తొడుగుతున్న మామిడి కొమ్మలపైకి ..
అప్పుడే వస్తున్న రెక్కలతో ఎగురుకుంటూ పోయి
తృప్తిగా మావిచిగురులను తిన్న పిల్ల కోయిల
కుహు..కుహు అంటూ. గానమందుకుంది..
శిశిరాన్ని వెనక్కి నెట్టుతూ వసంతుడు పరుగు పరుగున వస్తున్నాడు ..
ప్రచండ భానుడి తాపం పెరిగి..కాలం ఎండాకాలంలోకి వెళ్ళింది.,
మూడు కాలాలు ..ఆరు ఋతువులు..పన్నెండు నెలలు ..ఒక ఏడాది ..
చక్రబ్రమణంలో మార్పు లేదు..విశ్వంలో మార్పు లేదు..కానీ..
మనిషి మనుగడ సాగించే విదానంలో జరిగే మార్పులకి ..
పక్షి జాతి బలి అవుతూ..అంతరించి పోతుంది . ..
మధురమైన గాత్రంతో మనలను సన్మోహితులను చేసే కోయిలలు ..
అడవుల స్తానంలో వెలిసిన కాంక్రీట్ భవనాలలో గూళ్ళు పెట్టుకోలేక
“కోకిల “ ఇదే అంటూ కంప్యుటర్ లో కనిపించే బొమ్మలుగా మిగిలిపోతున్నాయి..!!
పల్లకి మోసేందుకయినా...
పాడె మోసేందుకయినా...
కావలి నలుగురు మనుషులు...
పల్లకిలో జీవం ఉంటుంది...
పాడె లో...నిర్జీవం ఉంటుంది...
జీవితం అంతే...కదూ...
నలుగురితో సఖ్యంగా ఉంటేనే..
జీవితం జీవిస్తుంది..
స్వార్ధబుద్దితో గెలిచే ఒంటరితనం..
మృత జివితో సమానం కదూ...!!


ప్రాణాధారాలు ..
గాలిలో తేలుతూ ...
వచ్చినేలపై పడిన ఓ విత్తనం 
మొలకెత్తి పదిమందికి నీడని ఇచ్చే 
మహా వృక్షంమై నిలవాలంటే..
తగినంత సూర్యరశ్మి ..
నీరు ..ఎంత అవసరమో ..
జన్మించే శిశువుకు ..
ఉత్తమమైన పౌరుడిగా ఎదగడానికి .
అమ్మానాన్నా..తాత నానమ్మా ల 
ప్రేమా ఆత్మీయతల అమృతపు జల్లులే 
అవసరమైన ప్రాణాధారాలవుతాయి..!!
నేలరాలు పూవులు ..
అమ్మ గర్బం నుంచి పేగు తెంచుకుని జారిన బిడ్డవలె ..
కొమ్మ నుండి వీడి నేలరాలు పూవులు ..
బిడ్డ తిరిగి అమ్మ గర్బంలోనికి వెళ్ళగలడా...
రాలి పడిన పూవు మరల కొమ్మకు అతుక్కోగలదా...
అమ్మ అయినా ...కొమ్మ అయినా..అమ్మ తనాన్ని అందించేవే ..
బంధం నిలుపుకోవలసినది నూరేళ్ళ జీవితానికి ముడిపడి ఉన్నది..
నేలను చీల్చుకుని మొలకెత్తిన విత్తనం ...
కొమ్మలుగా విస్తరించి రంగురంగుల పూలను పూయించి ..
సోయగాలతోనూ ..సుగంధాలతోనూ ...
చూసేవారి కనులకు ఆనందాలను ..
మనసుతో మైమరిచే వారికి ఆహ్లాదాన్ని అందించిన పూవులను
తిరిగి నేలతల్లి ఒడి చేరుస్తూ ..తృప్తి చెందుతుంది కాబోలు ...
ఎన్ని పూవులు రాలిపోతున్నా .. ఆ మొక్క మళ్ళి మళ్ళి పుష్పిస్తునే ఉంటుంది ..
ఆయుష్షు తక్కువయినా..అర్పించే తత్వం కలిగినవి పూవులు ..
అందుకే పూజా సామాగ్రిలో అగ్రస్తానాన్ని ఆక్రమించాయి..
తాము లేనిదే అలంకారము లేదు అన్న ధీమా కధూ పూవులది..
నేల రాలినా ఆ క్షణం....వాడని రాజసం ...వీడని పరిమళం ..
పూవులకు మాత్రమే సొంతమై ఉన్నది...
ఆత్మను వీడిన మనిషి శరీరం మాత్రం ..
చితిని చేరే పనికిరాని శవమై మిగులుతుంది..
మంచితనపు సుగంధంతో మనిషితనం విరబూస్తే...
కృష్ణుని సేవకు చేరిన నేలరాలిన పారిజాతమల్లే ..
అమరమై జీవితం ...తర తరాలకు ఆదర్శమయి నిలుస్తుంది..!!.
LikeShow More Reactions
Comment
మల్లెలు ..
స్వచ్చంగా ఉంటూ ..విచ్చుకుని నవ్వుతాయని..
మనసుకు మల్లెలకు పోలిక..
గుస గుసల గుభాళింపులతో మల్లెలు ..
ఎదలోన రేపే మరుల సందళ్ళు ..
వాడినా వీడని సుగంధం మల్లెలది ..
మరపులేని మనిషితనం మానవత్వానిది..
ఆత్మను చేరి లింగరూపమున నిలిచిన
జంగమ దేవర నీకు నమస్సులు
బ్రమరాంబతో కూడి శ్రీశైలమున వెలసిన
మల్లికార్జున స్వామీ! నీకు నమస్సులు...!!
భగీరధుని తపమును మెచ్చి ..
అతని కోరిక మేరకు ఆకాశము నుండి
ఉరికే గంగను శిగపాయల బంధించిన
గంగాధరా ..! నీకు నమస్సులు ..!!
మాయా లోకమున మర్మము తెలుపుతూ
మాయకాదు నిజమని వారణాసి పట్టణమే నిర్మించి
గంగమ్మ లహరులలో భక్తులపాపాలు కడుగుతుంటివే..
కాశి విశ్వేస్వరా ..! నీకు నమస్సులు ..!!
సాక్షాత్కారమున సర్వము నీవే నని తెలుపుతూ
మనోమందిరమున మనసాభిషేకములతో ..
ఆత్మార్పణల అర్చనల హారతుల జపముల
ఆది శంకరా హర హరా..!! నీకు నమస్సులు ...!!
LikeShow More Reactions
ఆవాసం..
ఆకాశమే వంగి హాయ్ ...అన్నది...
ప్రతి చినుకు పలకరింపుల
ప్రేమ కురిపిస్తున్నది...
పరువాలు తడిచి పాడమన్నవి..
ప్రణయ రాగాల మరులు
విరబూస్తూ....తేలమన్నవి...
ఏకమైన హృదయాలలో
వీణా... నాధాలేవో..మ్రోగుతున్నవి...
ఫలించిన అనురాగాలలో
విరహాలన్నీ...
విరంచిలయి చెలరేగుతున్నవి..
కావ్యమైన మనకధ
కౌగిలిలొ.... కరిగి..
నిజమైన కలలకు ఆవాసమైనది..!!
LikeShow More Reactions