21, ఆగస్టు 2015, శుక్రవారం

రామా.......
పదముల కుసుమాలనే
పెదవుల దారంతోటి
గీతమాల నల్లానురా....రామ
నీ మెడనలంకరించి
ఆ సుందర రూపు చూచుటకు
నా కున్న ఈ కనులు
చాలవురా...రామ
నవమి నాడే
నునుసిగ్గుల లేరెమ్మ సీతమ్మను
శివుని విల్లు ఒక్క వేటున విరిచి..
అధికారముతో చేపట్టినావే.....
ఆనాటి వేడుకయే
మాకు పండుగయైనది
ప్రతి సంవత్సరము...
పావనమైనది..రామా........//పదముల//
పట్టాభిరాముడవై
మాలో వేదనదూరం చేసేవు..
పరమాత్మ స్వరూపుడవై
మాఎదల నిలిచినావు
శ్రీరామ చంద్రుడివై
నీ స్మరణే జీవమైనది
ఆ పిలుపులోని ఆర్తిని విని..
అనుగ్రహపు వెన్నెలలను
కురిపించుమయా..రామా...//పదముల//
(మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు...)
— with Telugu E.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి