21, ఆగస్టు 2015, శుక్రవారం

కోకిలమ్మ పాట కచేరి
పల్లవి:
కోకిలమ్మ పాట కచేరీ....
సరిగమల సరసాల లహరి
చిలకల్లారా...రారండీ
సింగారాలే చూపించండి.....
చరనమ1:
పరువం పూవులు పుప్పొడి జల్లగా
చిగురాకుల గాలులు మెల్లగ వీచగా
వసంతుడే వేంచేసినాడమ్మా...!!
రారాజై రంగుల కనువిందు చేయగా...//కోకిలమ్మ//
చరణం 2:
గున్నమావిడి వేదిక పైనా
ప్రకృతి వింత శొభలలోనా...
కుహూ....కుహూ...అంటూ
పాటలే... పాడిందమ్మా ..
పులకించె ఒడలు పన్నీటి పూతలై..//కోకిలమ్మ//
చరణం 3:
పాటలకు విని మురిసినా..
కాని....ఆ వసంతుడు...
తనవాడై ఉండడని తెలిసిమూగదైనా ..
మరల వచ్చుననుఆశతో
కుహు..కుహు..అంటూ.. మళ్ళి మళ్ళి..//కోకిలమ్మ //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి