21, ఆగస్టు 2015, శుక్రవారం

*********కూచి పూడి..**********
అతి ప్రాచిన కళలలో..నేటికి మేటిగా విరాజిల్లుతూ..
ప్రపంచమంతా ...ఆంధ్రదేశపు శోభను వెదజల్లుతోంది....
కుచేలపురం నందు ...సిద్దేంద్ర యోగి మనో భావాలలో 
మోహినీ రూపమై..నర్తించి ...జన్మించిన కూచిపూడి నాట్యం...
భామనే..సత్య భామనే...అంటూ...జడపట్టుకు
ఒయ్యారాలు ఒలకబోసిన సత్యభామ అయినా.....
మధురా నగరిలో..చలలమ్మ బోదు ..దారి విడుము కృష్ణా..
అంటూ...వేడుకుంటున్న గోపెమ్మ అయినా..
ఆకులను పోలిన ఆల్తా అలంకరణ పాదాల లయలతో..
"సింహ నందిని "నృత్యంలో ..అచ్చంగా సింహాన్ని
చిత్రించే చిత్రం ..ఒక్క కూచి పూడి నాట్యానిదే....
రామాయణ ..భాగవత కథలను
రసమయంగా చూపించటమే కాక..
అన్నమయ్య కీర్తనల ఒదిగి పోతూ..
హావ భావాలను కడు రమణీయంగా
చూపించగలిగే నేర్పు కూచిపూడి నర్తకీ మణిదే...
అలంకరణ...ఆహార్యం...అభినయం..ఆంగికం..
పాద ముద్రలే కాదు..హస్త ముద్రలతో..
మరోలోకంలో విహరింప జేస్తుంది..
ఆచంద్ర తారార్కం అవని పై...నిలిచే కూచిపూడి నృత్యం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి