10, జనవరి 2017, మంగళవారం

ఎంత తొందరో ...
బాస్కరునికి ...తన లేత కిరణాలతో...
అలలపై తేలుతూ..జలకాలాడాలని..
కొండలని చీల్చుకొని...
ఉరికి ఉరికి వస్తున్నాడు..
ప్రకృతి కన్యకి భయమేసిందేమో....
కెంజాయ రంగులో మారి..
వెలుగు దుప్పటి సరిచేస్తూ ఉంది..
తనలో మునిగి తేలుతున్న సూర్యునితో
ఉబికే తరంగాలు ఆనందంతో ...
ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి..
పచ్చని ఆకులతో పహారా కాస్తూ చెట్లు...
భానుని ఆగమనానికి స్వగతం పలుకుతూ..
గాలి స్నేహ్యితునితో కలిసి..
ఈలాల గానాలు అలపిస్తున్నాయి..
రకరకాల బంగిమలలో మబ్బుల ముద్దు గుమ్మలు
మురిసిపోతూ ఆకాశ రాజులో ఐక్యం అయిపోతున్నాయి...
అనంత కోటి బ్రహ్మాండాలను తనలోనే దాచుకున్న
ఆది నాయకా ...అఖిలాండ స్వరూపా...
ఉదయాలు నీవే...అస్తమయాలు నీవే...
ఉపిరి పోసుకోవడం ఎంత నిజమో..
నీవున్నావన్నది అంత నిజం
దేవా దేవా...విష్ణు స్వరూపా...
మేలుకొలుపుల నీకు
నీరాజనం ఇచ్చెద..
మనస్పు ష్పాల అభిషేకించెద....
హారతినై నీకై కరిగిపోయి..
ఆత్మనివేదన చేసేదనయ్యా ...
అందుకొనుమా...ఈ మంగళ హారతి..


.ఆదిత్య నారాయణ...నమో నమః...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి