7, మే 2016, శనివారం

ఏమో...మరి...


వసంతమైతే వచ్చెను గానీ
మావి చిగురుల కోయిల కూయెనె లేదు
మల్లెలు కొల్లలుగా విరిసెను గానీ
పరిమళాల పలకరింపులు లేనే లేవు
వెన్నెల నుండుగా కురిసెను గానీ
చల్లదనపు చక్కిలిగింతలు లేవు
మావి చిగురు వగరుగాఉందనా...
కోయిల గొంతు మూగబోయింది
కలుషిత గాలులతో మిళితమై
మల్లెలు పలకరింపులు మరిచాయేమో...
వేడి నిట్టూర్పుల సెగలకి
వెన్నెల వెన్న అయి కరిగిపోతుందా...
ఇది అంతా ప్రకృతిలోని
మార్పేనా...?
" నేను " అనే అస్థిత్వాన్ని
కోల్పోయిన ' నేను '
అనుభూతించలేకపోతున్నానా....
ఏమో...మరి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి