12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఆత్మార్పణ
ఏదో చేయాలనే తపనతో
నీ తలపులను మరిచి
వ్యర్ధమయిన బ్రతుకు 
బ్రతుకు తున్నము ప్రభూ...!
గమ్యం తెలియదు
గడిచిన క్షణానికి విలువ లేదు
మనసు చెప్పే భావాలకి
భాష్యం తెలియదు
హృదయం చేసే రోదన
వినేవారు లేరు
అణుక్షణం అంతర్ మధనంలో
ఆత్మ అల్లాడుతూ ఉంటే
మూసిన రప్పల మాటున
నీ దివ్య మంగళరూపం
సెకనులో అరవయ్యో వంతైనా
నిలబడితే చాలు
పగలు చూడని పారిజాతం
నేల రాలుతుంది
అయినా...
నీ పాదల చేరేందుకు
పనికి వస్తుంది
అంతటి మహద్బాగ్యం
నాకు లేదు కానీ...
నా కగుపించిన ఆ లిప్త పాటు
కాలం చాలు నాకు
నీ చరణారవిందాల
కైమోడ్చుటకు
శ్రీనివాసా.....
శ్రీ వేంకటేశ్వరా.....
అనంతం నీవు.....
నా ఆత్మార్పణ...
అంగీకరించు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి