27, జనవరి 2014, సోమవారం

అమ్మ ఎప్పుడు అడగదు....


అమ్మని మించి దైవామున్నదా .....!
అని పాడుకోవడం తప్ప 
అమ్మ కి ఏమి ఇస్తున్నాం 
అన్న ఆలోచన 
కలిగిందా... ఒక్క సారైనా...!

అమ్మ ఎప్పుడు అడగదు ....

కన్న కడుపుకు వేల కట్టి
ఇమ్మని.....

రక్తాన్ని చనుబాలు గా 
మార్చి నీ కడుపు నింపినందుకు....

తన ఒడిని ఉయాల చేసి నిను 
లాలించి నందుకు

చందమామనే నీ లోగిలిలో 
ఆట లాడిస్తూ ...నీ
నవ్వుల్లో వెన్నెల్లు
తాను పంచు కున్నందుకు

బొజ్జ నిండినా...
ఇంకా ఇంకా గోరు ముద్ద 
అంటూ నీ పెదవంచున 
ప్రేమని పూసినందుకు

తడ బడే నీ అడుగులు 
చూసి తాను మురిసి
తాను ఊతమై నిను 
నిలబెట్టి నందుకు 

అక్షారానికి అక్షరం తానై
నీ చేత దిద్డిస్తూ
నీ అభివృద్ధికి 
తాను పునాది రాళ్లు 
గా మారి నందుకు 

ఆకాశం లో కెగురుతూ
అమ్మ కంట నిలిచిన 
చెమ్మ ని గమనించని 
నిన్ను ఏ నాడు నిందించనందుకు

రెండు నిమిషాలు నీ 
పలకరింపు కై 
తన జవ సత్వాలని 
కూడ దీసుకొని 
ఎదురు చూస్తునందుకు 

చివరి శ్వాస లొ
మూతలు పడుతున్న
కను రెప్పల అంచున
నీ మసక రూపం కోసం
పరితపిస్తూ ...
కలవరింతలలో ...
"కన్నా! తిన్నావా!"
అంటూ తల్లడిల్లు తున్నందుకు

అమ్మ ఎప్పుడు అడగదు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి