8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కోపం...తాపం..
మనువు నుంచి మొదలు 
మనిషి రూపము మాకిచ్చినావు ..
ఆ రూపులోనే నిన్ను ....
దేవునిగా కొలుస్తున్నాము..
కృష్ణ పక్షం...శుక్ల పక్షం అంటూ..
తరుగుతూ..పెరుగుతూ..ఉండే
నెలవంకని సిగన చుట్టి మెరిపిస్తున్నావు..
సుఖ దుఃఖాల నిలయం జీవితం
అని తెలియజెపుతూ..
సృష్టి ..స్తితి ..లయ కారకుడయిన
భానుని అగ్ని శిలలు నీలో నుంచి
జనించినవే కదా ఈశ్వరా..
ఆ తాపం తగ్గించు కొందుకే..
గంగమ్మని తలపై నుంచుకొంటివి...
ప్రేమ తత్వం తెలుపుటకే..
నీకై తనువు చాలించిన సతి..
పార్వతిగా తిరిగి నీకు ఆలి అయింది..
నీలో సగం తనకిచ్చి నీవు..
అర్ధనారీశ్వరుడవి అయినావు...మహా దేవా..
ఐక్యమయిన ఆత్మల సంబంధం
ఆలుమగల అనుబంధం ..
అలకలయినా...అలింగనాలయినా..
మూతి విరుపులు ..
మగని క్రిగంటి చూపుల మెరుపుల కొరకే..
ఈ తత్వం తెలియదా నీకు శంకరా....
(కొస మెరుపు ...)
మరెందుకయా...
ఆవకాయ వడ్డించ లేదనా ..అమ్మ మీద కోపం..!!
ఏ సి రిపేరు చేయించ లేదనా తల్లీ...ఈ తాపం..!
మంగళ కరములు
శ్వేత వర్ణంలో మెరిసిపోతూ..
తల్లి సరస్వతీదేవి....
వేలికదలికలలో పలికించే..
వీణానాధ సమన్వయంలో..
తెప్పరిల్లుతూ తండ్రి బ్రహ్మ దేవుడు..
అత్యంత శ్రద్దతో..మలచిన శిల్పమా..
ఏమని వర్ణించను..
ఉదయ కాంతులతో పోటీ పడుతూ..
నీ మేని ఛాయ ..బంగారు రంగులో మెరుస్తూ..
అరవిందమయిన ముఖంలో..
తామర రేఖుల వంటి కనుల తళుకులు ..
పూసింది సంపెంగ నాసికై...రవ్వల ముక్కు పుడకతో..
తుమ్మెదరెక్కలవలె ..కురులు సిగను బందీ అయి..
కలువలను కరముల మోయలేక సఖి..
ఎదలోని భావాల దోసిలిలో ..
అరమోడ్పు ఆరాధనల అర్చనలు..
మేలుకొలుపుల వెంకట రమణునికివే..
ఉషోదయపు హారతులు...
శ్రీనివాసుని చరణ కమలములే..మంగళకరములు.
మృతమై..!!
సహించ లేనిది
ఈ ఎడబాటు...
భరించ లేనిది.. 
నీ తలపులను
మరచిన గ్రహపాటు...
కలతలన్నీ కలిసి...
వేదనలను ప్రేమించి...
ఎద గూటిలో చేరి..
కాపురమున్నాయి ..
పదిలంగా....
మర్మమెరుగని మనసు..
మౌనించి...శ్వాస విడిచి..
సమాధి స్టితినొందె......
మసక బారిన చూపులతో..
కనులు వాలిపోయె.....
బ్రతుకు భారమై...
ఈ కాయం ఛరించే...మృతమై.
నా కొక్కదానికే తెలుసు..!
వేకువలో విచ్చిన కిరణం ..
కమ్మిన మబ్బులలో ....
దాగుతుందా...
తన ప్రసరణను అపుతుందా...
వీక్షించే కనులలో..
వేయని రెప్పల మాటున ..
నీకై శ్వాసించె నా ఆత్మ చప్పుడు
నా కొక్కదానికే తెలుసు..
జీవిత సమరంలో ...
గెలుపు గురుతులు కానరాక..
ఓటమితో చెలిమి చేయలేక..
నీ మదిలో జరిగే సంగర్షణల జ్వాలలో ...
ముసురుతున్న నల్లటి పొగ సెగలో..
సైతం నా తోడు కోసం పరితపించే..
నీ మనస్తత్వం...
నా కొక్కదానికే తెలుసు...!
ఎరుపెక్కిన నీ కన్నులు ...
లోలోన కోరుకుంటున్నాయని..
నా ప్రేమస్పర్శల ఆలంబనని....
కసురుకుంటున్నా....నీ మాటల వెనుక...
నన్ను పోగొట్టుకుంటానేమో ...
అన్న బయం దాగున్నదని ...
నా కొక్కదానికే తెలుసు..!
‘నాతిచరామి ‘ అన్న నీ మత్రోచ్చారణకర్ధం...
మనము ఒకటిగా ఐక్యమవటమే...
.మన్నింపులు ...కంటి చెమరింపులు
మనలను పెనవేయు బందాలే...
సమాజస్థితిగతులలతో పోరాటం చేస్తూ..
జీవించే బలాన్ని తెచ్చుకుని..
మన గమ్యం మనమే అన్న సత్యం
మన ద్యేయమై...
సంసారవీణను శృతి చేసుకుంటూ..
మృదు మధుర గీతాల ఆలాపనల ..
రాగఝరిలో ఓలలాడుతూ...నీలోనేనుంటానని...
నాకోక్కదనికే తెలుసు...!!
**************
ప్రశ్నార్ధకమే...!!
క్షణాల కంచెలని
కత్తిరించు కుంటూ.....
వెనక్కి విసిరేస్తూ..
పోతుంది కాలం..
రాసులుగా మారుతున్న
క్షణాల గుట్టలను ..
ఆకలితో మింగుతుంది...
గతం ఆవురావురు మంటూ..
ముందుకు వేసిన అడుగుతో..
వెనక్కి చూస్తే..
మార్చలేని నిన్న..వేదనతో..
భారమైన గుండెని ..
మోయలేక...ఆశ చావని మనిషి..
నేటిలో జీవించలేక....
రేపును చూస్తే..అదీ...ప్రశ్నార్ధకమే...!!!!
పుష్పకవిమానమే...మరి...!
ముల్లోకాల్లోనూ అతి ధనవంతుడయిన కుబేరుని
మనో భావాల సమాహారమే...పుష్పకవిమానం ..
స్వర్గాన్ని జయించిన రావణుని చేతులలో చిక్కి..
భువికి ఏతెంచి...లంకానగరానికి శోభగా నిలిచింది పుష్పక విమానం.
.
వాయువేగాన్ని మించిన మనోవేగం కలదై
సీతాపహరణలో ముఖ్య పాత్ర పోషించి..
మూగగా విలపించింది... పుష్పక విమానం..
రావణసంహార అనంతరం...సీతాలక్ష్మణ ఆంజనేయులే కాక..
విభీషణ సుగ్రీవ ..మొదలగు .. అతిరధ మహాయోధుకను.. తనలో..
పొదువుకుని.. మరొకరికి చోటు చూపిస్తున్న అక్షయం .. పుష్పక విమానం..
అన్నగారి రాక ఘడియ ఆలస్యం అయినదని....
ప్రాణ త్యాగానికి సిద్దపడ్డ భరతుని ఆనందసాగరాన తేలింపజేస్తూ..
తళతళమెరుపులతో..మింటి నుంచి మేఘంలా వాలింది పుష్పకవిమానం...
భక్తిరస ఆస్వాదనలో ఇహం మరచి..పరమాత్మను తమలో
దాచుకున్న భక్తాగ్రేసరులకు ముక్తినొసగుతూ...
సుశరీరాన్ని మోసుకెళ్ళే మహిమాన్వి ..పుష్పక విమానం..
ఇతిహాసాన్ని చదువుకుంటూ... ఇవి ఇహంలో లేవు అనుకున్నా...
ప్రతి మనిషి మనసు కూడా పుష్పకవిమానమే..
పుట్టిననాటి నుండి.. సమస్యల వలయాలు ..
వేదనలు...రోదనలు.. కలతలు కన్నీళ్ళు..
ఆరాధనలు, ఆవేదనలు... ఆనందాలు ..అతిశయాలు...
జవాబు దొరకని ప్రశ్నలు.. జీవం మరచిన జీవితాలు ....
స్వార్ధంతో పక్కవాడిని పడగొట్టాలనే తాపత్రయాలు...
ఎన్ని ఎన్నిటి నైనా..అలవోకగా మోసే మనసు పుష్పకవిమానమే.మరి..!!
***************** *************
మాట్లాడే బొమ్మ.
మట్టిని తెచ్చావు..
నీటిని వేసి కలిపావు...
కాళ్ళ కింద వేసి తోక్కావు...
వేళ్ళ సందుల్లోంచి బయటికి వచ్చేలా..పిసికావు..
నీ ఉహలకి ప్రాణం పోసుకుంటూ...
మలిచావు అందమైన బొమ్మగా..
కొలిమిలో వేసి కాల్చావు...
మళ్ళి...చల్లార్చావు...
నీ మనసు దీరా చూసుకుంటూ..
రంగులను వేసి..మురిసిపోయవు..
మెరుపు బట్టలేసావు..పూసల దండలతో
ముస్తాబు చేసావు..
నీ ఇష్టాన్ని కళ్ళ ల్లోంచి కురిపిస్తూ..
తడిమి తడిమి చూస్తావు..
ఇన్ని చేశి నీవు...షో కేసులో ఉంచుతావు..
అలంకారానికి అందంగా ...
ఏళ్ళకి ఏళ్ళు గిదిచిపోతూ ఉంటాయి..
మారనిది బొమ్మ స్థానం మాత్రమే..
ప్రాణం లేదు..పలుకలేదు అనుకున్నా..
ఒక్కో సారి వాటికళ్ళల్లోకి చూస్తూ ఉంటె..
ఎన్నో ప్రశ్నలు వేస్తాయి..
మనలో చెలరేగిన ప్రశ్నలకి జవాబులూ చెపుతాయి...
అందుకే...బొమ్మకి ప్రాణం లేదు అనుకోవద్దు మరి..!!
******** **********