3, మార్చి 2014, సోమవారం

పండుటాకు....

పండుటాకునని...
పనికి రాని దాన్నని...
విసిరి పారేసారు.......

ఇన్నాళ్ళు నా
పత్రహరితం తాగుతూ.
కొత్త చిగురులు తొడిగిన
కొమ్మ ...
నన్ను తనకు తానుగా..
రాల్చేసింది....

జీవం లేదని మాకు
అనుకుంటే..పొరపాటే...
ఒక సారి ముట్టుకొని చూడు..
పెళ పెళ మంటాము....
గుండెలు పగిలే ఘోషలె
వినిపిస్తాయి...

నిస్తేజమయినా...మాకు
జీవితానుభవం నేర్పిన పాఠాలు
భవితకు తెలియజేయాలనే...
తపనలతో...కంటి చెలమల తో
ఎదురు చూస్తూ ఉంటాం
వృద్దాశ్రమాలనయినా...!!
గులాబీలు ....

చెక్కిట పూసిన ఎఱ్ఱగులాబీలు
అవి నీ చూపులకు కందిన విరిబోణులే కాదా!!
...
ఎదవనంలొ చేరిన తెల్లగులాబీలు
నీ స్నేహ మధురిమల సౌరభాలేకాదా...!!

మదిపొరలలొ...దాగిన మంచుగులాబీలు
నీ మమతలు పేర్చిన ప్రెమపూలసజ్జలేకాదా...!!

చిగురాకుల దాగిన విరిసీవిరియని గులాబీలు
నీతలపుల మైమరచిన.. అరమోడ్పుకన్నుల సోయగాలేకాదా..!!
అనగా...అనగా...

కాసీ మజిలీ కథలు ...
కాకమ్మ కబుర్లయ్యాయి...
కంప్యుటర్లొ కార్టూనమ్మల ...
కాకా వికలకే ..
బాల్యం బానిసయ్యింది

ఆంక్షలు పెట్టే
అమ్మానాన్నల చూపుల తప్పుకొని
బామ్మల కొంగుచాటు చేసుకొని
పప్పు బెల్లాలారగించిన పసితనం
పోటీతత్వాల పాకుడురాళ్ళపై
జారి జీవం కోల్పోతుంది.....

అనగా..అనగా..
అని చెప్పే పెద్దరికం
వ్యర్ధ పదార్ధమై...
పారేసిన విస్తారే అయిపొయింది...!!
చిత్రకారుని కుంచెలోని
అపురూప చిత్రమై
మది పొరల కెలుకుతుంది...!!
ఆత్మగా మిగిలి....

కుసుమిస్తున్న
మందారంలా ఉన్న నన్ను...
కోసి పూల సజ్జలో వేస్తావనుకున్నా.......

అనురాగ మందిరంలో
అప్రురూపంగా
దాచుకుంటావనుకున్నా

విప్పని రేఖులను విడదీసి....
పుప్పొడి రేణువుల
పిడికిట నలిపేసావు...

వలపు తీవెల
ఊయలలూగాలని
అశల పొదరిళ్ళ
అల్లి బిల్లి ముగ్గులేసిన నేను...
నీ అహంకారపు అకృత్యానికి
శ్వాసలను అర్పించి
నేల రాలిన విరినై...
ఆత్మగా మిగిలి..
నీ అంతరంగం చదవాలనే
నీ అనుభూతుల చుట్టూ
తిరుగుతున్నా...!!
మన ప్రభుత్వం...

అహింసని ఆయుధంగా
చేసుకొని స్వరాజ్యాన్ని
తీసుకొచ్చారు బాపూజీ....!!...

హింసనే..ఉపయోగించి...
ఓట్లు వేయించుకొంటున్నారు...
మన బడా నాయకులు....!!

ప్రజాస్వామ్యం...
ప్రజల కందని భాగ్యమైంది...
స్వార్ధ రక్కసి కోరలలో..
చిక్కుని..కొనఊపిరితో కొట్టుకుంటుంది...

ఉచిత భోజనం, ఉచిత విద్య,
ఉచిత కరెంటు పథకాలు
ఉన్నోడి గోధాముల గోనెసంచుల్లో
డబ్బై...మూలుగుతున్నాయి...

ప్రాంతీయ తత్వం ప్రచండమై...
నీది నీకె..నాది నాకే...
నానుడి నిలబడింది...

సమాధానాల సమూహం (అసెంబ్లీ)
మాయమై...
రంకేలేసే...
రాబందులకు (రాజకీయనాయకులు) నెలవైంది....

ఐకమత్యం చెదిరి...
నిందల రాజకీయం
పైశాచిక నృత్యం చేస్తుంది..పార్లమెంటు పరితాపంతో....
మౌన భాష్పాలు రాలుస్తుంది....

మూడు వన్నెల
రెపరెపలమూగరోదనలో....
అశోకచక్రం
రంగు వెలిసిపోయింది...
న్యాయం
నాలుగు సింహలకాహారమయింది...!!
ఇదే..మన ప్రభుత్వం..మరి!!ి!!
మహాత్ములు ...

మార్గ దర్శకులు ఎక్కడో లేరు..మహాత్ములు ఎవరో కాదు...
ప్రతి లోగిలిలో...పండుటాకులై..పరమాత్మస్వరూపూలుగా కనిపిస్తూనే ఉంటారు
ముక్కు మూసుకు మూలక్కూర్చో...తాతా..అని అలుసు చేసే మనవళ్ళకి......
తెలియదు...వారి ఆరోగ్య రహస్యం....వారి ఆత్మ సందర్శనం

గాజుకళ్ళ లో...గగనాలనంటిన ఆదర్శాలు
ముడుతల చర్మాలలో...మర్మాలనెరుగని మమతానురాగాలు
వారి మాటల వేదాలను... ఆవాసం చేసుకొని...
పరిస్థితుల ప్రళయాలను ఎదుర్కునే స్థైర్యానికి బాట వేద్దాము...!!
అర్ధానారీశ్వరం......

ఆలనలో.....ఆమె...
పాలనలో....అతను
అర్ధనారీశ్వరరూపములో......
అర్ధం...పరమార్ధం...

మంచు కొండ లయినా...
మమతల మందిరాలే...
విభూదిరేఖలయినా...
అలంకారసోభితలే...

ఒక కన్ను
కవ్వింత అయితే..
మరొక కన్ను...
పులకింతే...

శివతత్వంలోనే..
బేదాలకు తావు లేదు.....
భార్యా భర్తల నడుమ
నేనే అను అహం లేదు...

శివుని శక్తి పార్వతి...
పార్వతి అనురక్తి శివుడు...
స్త్రీ పురుషులు
ప్రకృతి నిలయాలు..

మానవత్వంలో...
ఈ ఏకత్వమే రావాలి...
భావి భారతంలో...
ఆడది అబల కాదు
అని నిరూపణ జరగాలి...
పాశవికం నశించి...
పరిపూర్ణత్వం కావాలి...
అర్ధనారీశ్వరంలోని
అర్ధాన్ని అపురూప
నిలయం చేయాలి...
అప్పుడే...నిజమయిన
శివ పూజ ...
అప్పుడే..ఆదిశక్తికి
ఆర్ద ప్రణామాలు ....!!