26, జూన్ 2016, ఆదివారం

****కదూ మరి..*****
అమ్మమ్మా....మీ చెట్టుకి ఎన్ని మామిడి కాయలో..!
కూతురి కూతురు..అబ్బురంగా అంటుంటే...
నానమ్మా .. మన మామిడి చెట్టు ఇన్ని కాయలు కాసింది..
కొడుకు కూతురు...ఆత్రంగా చెపుతుంది..
ఆ “మీ “ ...లో..ఈ “మా “..లో ...తేడా..
అమ్మమ్మకి..నానమ్మకి...ఆలోచనలలో..
నవ్వుకున్నా...ఇద్దరు నా ముద్దుల మనవరాళ్ళే మరి..
అ ఆ ల నుంచి పెద్ద భాలశిక్ష ..తరువాత రామాయణ 
భాగవతాలను తాత్పర్యసహితంగా చదివించిన ఘనత 
మా తాతగారిది...అయితే....కంప్యూటర్లో..కళ్ళకు కట్టినట్టు..
పురాణఇతిహాసాలను చూపిస్తూ...తెలియని ఎన్నో విషయాలను 
అర్ధం అయేలా చెప్పే నేర్పు ...నా మనవడిది...మరి..
రాత్రి పగళ్ళను మింగుతూ...కాలం 
తరాలను..అంతరాలను ... మారుస్తుంది ..
కానీ ..తాత నానమ్మ..తాత అమ్మమ్మ ల ప్రేమ 
పెనవేసుకున్న పేగుభందం మాత్రం ఎప్పుడు అక్షయ పాత్రే.. 
బాల్యాన్ని తిరిగి పొందే అదృష్టం వారిదే కదూ..మరి...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి