29, జూన్ 2014, ఆదివారం

ఆహా! చీమ...!!
చిటుకు మణి కుట్టి
చల్లగా జారుకుంటూ..
ఎక్కడెక్కడో దూరిపోయి...
కలవరపెట్టే ...చీమ...

ఛి...చీ...చీమ....
అని ఛీదరించుకున్నా...
తన పని కోసం..
తను హుందాగా....
నడుచుకుంటూ వెళ్ళే చీమ..
ఎత్తులైనా...పుట్టలైనా..
చ్తెట్టు లైనా...చేమలైనా..
ముందు చూపు తో..
ముందడుగు వేసే చీమ....
ఒంటరి తనం ఎరుగక...
తనవారికోసం...తాను
ఇక్కట్లకు గురి అవుతున్నా..
సంగీభావంతో మెలిగే చీమ...
నల్ల చీమ...ఎర్ర చీమ..
రెక్కల చీమ...గండు చీమ..
రకాలలో..ఎన్ని ఉన్నా...
ఒకటే...రకం మనుగడకు
ఆలవాలం..చీమల రాజ్యంలో..
చూసి నేర్చుకుంటే.....
మనుషులు..జీవించటంలోని
లోటు పాట్లను అవలీలగా
అధికమించ గలుగుతారు...
కదూ...మరి...!!
అందుకే..
చీమ..అని చిన్నచూపు వద్దు..
ఆహా!!..చీమ....అనుకుంటే...
అవధులను అవలీలగా
దాటేయటం కద్దు.....
హద్దు దాటని బ్రతుకును
తెలుసుకొని...మసలు కుంటే..
శాంతి సుఖాలు మనవే..ఇక..
అందమా...మరి..ఆహా!! చీమ..!!
See More

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి