26, ఫిబ్రవరి 2018, సోమవారం

భారతం...
పల్లవి..
జనని ఇది..
జన్మభూమి ఇది
బ్రతుకుకు అర్ధం తెలిపే..
కర్మభూమి ఇది..
ఇదే..భారత దేశం.
ఇదే..మన భారత దేశం..
చరణం1.
మంచు పర్వతాలే...
సువర్ణ కిరిటమైతే..
గల గల పారే నదులే...
మేలి ముసుగులా చీనాంబరాలు ...
పచ్చని పైరులు..పలరించు ప్రకృతి.
అమ్మ....ఆభరణాలు..
ఉప్పొంగుతున్న అలలతో...
రక్షణ కవచమయినాయి ...
మూడు వైపులా సముద్రాలు...
వెన్నెల మమతలు కురిపించే తల్లి..
మన భారత మాత...
అమ్మా ! వందనం..అమ్మా ! వందనం....//జనని ఇది..//
చరణం2.
అమ్మ ..మమ్మీ ...అమ్మి..
ఏదైనా ..పెదాలు కలిపే..పదమోకటే..
ప్రేమను పంచేది..ఆ మమతొకటే..
లేదు మతాల తేడాలు...
లేవు కులాల భేదాలు..
రానే రావు భాషా భావ తారతమ్యాలు..
కాష్మీరం నుండి..కన్యాకుమారి వరకూ
మనమంతా..ఒక్కటే ....
అన్నదమ్ములం...అక్కా చెల్లెళ్ళం...
భవితవ్యాన్ని పరిమళింపజేసేందుకు
అల్లుకున్న పూల మాలలం..
భారతీయులం...భారతీయులం..
వందే మాతరం..వందే మాతరం...//జనని ఇది..//
సంక్రాంతి సంబరాలు ...
హేమంతపు చలి కొరుకుడులు
లో లోనకి దూరి ..
చక్కిలి గింతలు పెడుతున్నా ...
తూరుపమ్మ ఎర్ర చీర సింగారించకుముందే ..
ఎగ దోసిన కుచ్చిళ్ళను ...
జారుతున్న పైటను లెక్క చేయక...
తమ వాకిలిలో ముత్యాల సరాల ముగ్గులు..
ఇంద్ర ధనుసును పోలే రంగవల్లికలు...
తీర్చి దిద్దలన్న తపనలతో..
విల్లై వంచిన నడుముతో ..
కొంటె గాలి ఊరకుండక...
మాటి మాటికి కురులను చెరిపేసే వంకన
చెక్కిళ్ళను ముద్దాడి పోతుంటే..
శంఖంలాంటి మెడను విదిలించి ..
నిదుర బారాన్ని వదిలించుకున్న కనులతో
ఉరిమి చూస్తూ...అంతలోనే ..
పెదవులపై నెలవంకను నిలుపుకుంటూ..
రెక్కల గుర్రం మీద వచ్చే రాకుమారుడు కాదు గాని..
రెక్కలున్న విమానం ఎక్కి వచ్చే
రాజశేకరుడు తన వాడే అన్న తపనల కలలను..
ఎదలోపల దాచుకుంటూ ..
సంక్రాంతి శోభను తమ ముంగిటిలో పట్టి బందించే..
ఆ పడుచుదనం అందాలను చూడ ..
ప్రకృతి సైతం స్తంభించిదేమో...
పందాలకై తయారయిన కోడి పుంజులు
ఇక ఒకటే గోల...కొక్కోరోక్కో అంటూ..
గుమ్మడి పూలను కొప్పున పెట్టుకుని
గొబ్బెమ్మలు పేరంటానికి వచ్చేసాయి..
నవదాన్యాల ఆభరణాలు ధరించి..
ఉత్తరాయణంలోనికి అడుగుపెడుతూ సూర్యుడు ..
తూరుపమ్మ ఎర్ర చీర విప్పే ప్రయత్నం చేస్తున్నాడు..
పల్లె సీమకు పట్టు కొమ్మ వలె సంక్రాంతి సంబరాలు ..
భోగిస్నానాలను చేసి ..అంబరాన్ని తాకుతూ ..
ఎగురుతున్నాయి గాలిపటాలై...ఆనందాల విందులతో...!!
**************
సీతమ్మవారి నుదుటన ఉన్న సింధూరం
రామయ్యకి ప్రీతి పాత్రమని ...
వళ్ళంతా సింధూరం పూసుకున్న హనుమా
నీవే ఆ రాముని ప్రేమని పొంది..
ఆయన ఆలింగనాల ఆయువువు అయినావా..హనుమా..
ఆకుతో పూజిస్తే అభయమిస్తావు...
అరటిపండు నివేదిస్తే...
ఆనందపడుతూ...ఆధరిస్తావు...
రామ నామంలొ వనం నీవు..
ఆ వనంలోని సుమాలన్నీ..
రామ భక్తి తత్వంలో లీనమై..
రామ స్మరణల పరిమళాలను గుభాళిస్తున్నాయి...
నిను కొలిచే భాగ్యానికి నోచుకున్న మేము
నీ పాదాల అడుగుల కైమోడ్చి...
సమర్పించెదము ఆత్మ సాక్షిగా వందనం...
జై హనుమాన్..జై హనుమాన్..జై హనుమాన్..!జై శ్రీ రాం..!!
మనిషింతలోనే....
ఆ గాలిని గిచ్చి ..
అల్లరి చూపుల ముడివేసి..
గుండెకు గాలమేసి లాగినాడే..
ప్రేమంటూ మత్తుజల్లి ..
మనసును మాయచేసి..
మాటల పట్టీ వేసినాడే..
దేవుని సాక్షిగా చెప్పి ..
మెడలో మూడుముళ్ళు వేసి..
తపనలతో తనువంతా దోచినాడే..
చిట్లిన పెదవులనేమార్చి...
బరువుగ వాలిన రెప్పలకింద చీకటి చేసి..
మొగమైనా చూపలేదే...
మనిషింతలోనే మారేనా....!!
మనసు తెర చాటు..
కనులు తెలిపే మాటలు ఎపుడూ
మౌనాలను తెరచాటుగా చేసుకుంటాయి..
నీడని మాయం చేసే సూర్య కిరణాల వలె 
అతివ అంతరంగం లోనికి చొచ్చుకొనిపోయి ..
ఆ తలపుల తపనలకు తన వలపు పూ రేకుల
పుప్పొడిని అద్ది మనసంతా ఆక్రమిస్తే..
ఆ మాధవునిగా నిను భావించి ...
రాధగా తాను మారి ఆత్మార్పణగావించదా..
మౌనాల తెరచాటున దాచుకున్న
మాటల మల్లెలతో నీకభిషేకము చేసి...!!
నా జాబిల్లి ..
ఓ మల్లి ..
నీపై మనసుపడి.
తెచ్చానే తోటకు వెళ్లి ..
బొండు మల్లి ..
గువ్వల జంటల కువకువలా..
మన రెండు గుండెలు ..
ఒకే మాట చెపుతాయి..
వాలిన రెప్పల సందుల్లో
దాగిన ఆ మాటే...
నువ్వంటే నాకిష్టమని...
నువ్వంటే నా కిష్టమని...
ఓ మల్లి...
నిండు పున్నమి జాబిల్లి..
ముక్కున మెరిసే ముక్కెర తోటి..
పెదవిపై మొలిచిన చంద్రవంక పోటీ..
ఎరుపెక్కిన బుగ్గలతోటి ..
నుదుటను నిలిచిన సింధూరం పోటీ ..
నాదే అను ఈ అందంతోటి ...
నీదైన ఈ మగసిరి పోటీ..
ఓ మల్లి ..నా జాబిల్లి..!!
శ్రావణ మేఘాలలో నుంచి తొంగి తొంగి చూస్తూ..
నీలోని మమతల వెన్నెలని దొంగలించుకొచ్చిన
ఆ చందమామ ..
శరత్ చంద్రుడై పున్నమిలో మింటిని ఏలుతూ ఉంటే..
నదీనదాలు ఆబగా ఆ వెన్నెలను తాగేస్తున్నాయి..
ఔషధీయిక్తమైన ఆ నీటి అలలస్పర్శలు ...
ప్రకృతిలోని ప్రతి జీవికి ఆసరాగా మారి ..
అమ్మలా అమృతం పంచుతున్నాయి...
(నేను ఇస్తున్నా Uma Devi Kalvakota.....ఉమా రెడీ...)