7, జులై 2014, సోమవారం

దేవాలయం....


ఆలింగనం చేసుకున్న ఆరాధనలకి
ప్రతి రూపంగా ...కనుల ఎదుట నిలిచే..
ఆ ఆదైవం కొలువున్న కోవెల...

గోపురం దగ్గరే..పవిత్రతను సంతరించుకొని
దర్శనం తోనే మనసుకు శాంతి నోసగుతూ..
గడపలోని  గంభీరతని కళ్ళ కద్దుకుని..
లోనికి అడుగిడినంతనే...అణువు.. అణువు..
అభయప్రదాతను చేరుకున్న అనుభూతులను
 కలిగించే దేవాలయం..

కైమోడ్చి హృదయాన నెలకొన్న బగవంతుని
ఎదుట నిలిచి హారతుల ఆత్మసమర్పణ నొసగుతూ
నివేదనల నిరాజనాలతో..పూజలందుకొనే
ఆ సర్వాంతర్యామి సన్నిధే..దేవాలయం....!!


29, జూన్ 2014, ఆదివారం

తూటా....


కాకి బట్టలు కాకుల ఈకలకి...
అమ్ముడవుతూ ఉంటె..
కసాయి తనం కరుడుకట్టి..
ఉన్మాదులను తయారుచేస్తుంది..


ఊరుదాటితే..అన్నలు..
దేశం పొలిమేరల్లో...ఉగ్రవాదులు...
క్షణ క్షణం అరచేతిలో ప్రాణం పెట్టుకొని
బయానికి ఊపిరి పోస్తూ బ్రతికే జనం ..

తూటాలకు తునకలయిన భరతమాత
కన్నీళ్ళు ఉప్పెనై ఉరకక ముందే..
ఆనకట్ట వేసే మహానుభావులు ..
వెలికి రండి...కాపాడుకోండి...
తల్లి ఋణం తీర్చుకోండి..!!
బ్రహ్మ కమలం


జాబిల్లి లోని వెన్నెలనుదోచి
హిమగిరిపైని చల్లదనంలోరంగరించి
జన్మించావా కైలసగిరులపై.......
ఆ బ్రహ్మ నడిగి పేరును
అరువు తెచ్చుకొన్న కమలమా!
కొలను నీకు ఆవాసం కాదు...
వింతయేమిటో...
కాండం లేని పుష్పమైనావు...
పత్రంలోనుంచి కుసుమిస్తూ...


నీ రాక ఎరువాకే....
ఏడాదికొక్కసారే.....
సంబరాల విందులు
ముచ్చటల పసందులు...
పరిమళాల ఆస్వాదనలు...
బ్రహ్మ కమలమా...
బహుమూల్యమగు
భావాల ధనమా..
సౌందర్యాధకుల స్వప్న
శోభితమా...!!
చార్మినార్'


భాగ్యనగరును ...హైదరాబాదుగా మలిచిన ఘనతతో ..
నాలుగు బురుజులతో..నలుదిక్కులకు చూపులు సారిస్తూ..
నవాబు కట్టడాలలో అద్భుతంగా మిగిలిన రాజసమై.....
జుమ్మా మసీదు పక్కనే ..అల్లా ప్రార్ధనలను ఆలకిస్తూ..
చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని సంపాదించుకుని
మత సామరస్యాని మారు పేరుగా నిలిచిన..
తెలంగాణా ప్రజల మనోరధ మకుటం.మన .'చార్మినార్'

సూపర్ స్పెషాలిటి మాల్స్ ఎన్ని వచ్చినా..
ఎడతెరిపి లేని జనంతో కళకళ లాడుతూ..
కనులకు విందు..మనసుకు పసందును కలిగిస్తూ..
దొరకని వస్తువంటూ లేని బజారులకు ఆవాసమై
పేద..ధనిక వర్గాల తేడాలను రూపుమాపుతూ..
సమ సమాజ శాంతి చేకూరాలని ఆశించే.. మన 'చార్మినార్'
పిచ్చోడా...!!


పలుకులు రాని
మూగదాన్నేరా ..
...
రెండు ముద్దలు తిని
మూడో ముద్ద నా కొడుక్కోసం
అని దాసే అలవాటున్న .
పలుకులు రాని మూగదాన్నేరా..
పసితనం నుంచి
పనిచెయ్యటం అలవాటే....
ఆ అలవాటుతోనే కన్నోడ్ని
కలెక్టరు చేసినాగాని ...
నాకు ఆపనే ఆదారమైనది
ఆ రెండు ముద్దలకోసం..
ఈ నాటికీ ..అయినా...
ఆనందపడే తల్లినేగాని..
.
ఎప్పటికీ..నేను...
పలుకులు రాని మూగదాన్నే రా..
కొడుకా...పిచ్చోడా...!!
శునక రాజాలు

'కుక్క చావు చస్తావు ' అని అంటారు......
కాని ఆ కుక్కకు దొరికిన అదృష్టం ఎవరికి దొరుకుంది..
ధర్మానికి కట్టుబడిన జన్మ కనుక ...
ధర్మరాజుతో పాటు స్వర్గానికి వెళ్ళింది...

సాయి బాబాగారి ప్రేమకి పాత్రురాలై ..
తన బ్రతుకుకు సార్ధకత చేకూర్చుకుంది.
అయన ఆత్మను తనలో నిలుపుకొని
తాను పరమాత్మ స్వరూపంగా మెలిగింది..
దత్త ప్రభువు చెంతనున్న నాలుగు కుక్కలు..
నాలుగు వేదాలకు రూపాలై..
భరతావనికి మార్గదర్శకాలుగా నిలిచి ..
పురాణాలలో చిరస్థాయిని పొందాయి....
పోలీసు వాళ్ళకు వాసన కనిపెట్టే డిటెక్టివ్లయి
నేరాలు చేసిన వాళ్ళను పట్టించేందుకు
అవసర పడుతూ యమ దూతలవలె ముందుకురుకుతాయి
మరి కుక్కలని చిన్నచూపు మాని..శునక రాజాలకి ప్రేమని పంచుదాం..!!
కృష్ణమ్మా..!!

మహాబలేశ్వర్ లో పుట్టి
పరవళ్ళు తొక్కుతూ...
వలస వచ్చిన కృష్ణమ్మా......
నీ కులుకుల నడకలకు
పరవశించిన పంటచేలు
పసిడినందిచేను కదమ్మా..


అమరావతిలో అజరామరమై ..
శ్రీశైలమల్లికార్జునునిలో చేరి పునీతమవుతూ
విజయవాడ కనకదుర్గమ్మ కాళ్ళ పారాణివై..
అలసి సొలసి బంగాళాఖాతంలో సంగమించే తల్లీ .
నీ సిగపాయల చేరిన జనుల కాపాడు కల్పవల్లీ..!!