26, ఫిబ్రవరి 2018, సోమవారం

ఎంత కరుణయా నీకు నాపై..
హిమ శిఖరమల్లే నీవుండి..
గంగమ్మనే నా కన్నులకిచ్చినావే..
ఎంత కరుణయా నీకు నాపై..
ఆత్మలో నిలిచి ప్రతిక్షణం
ఆవేదనల అభిషేకాలు చేయించుకుంటున్నావే...
ఎంత కరుణయా నీకు నాపై..
నీ నామంతో గుచ్చబడిన
నా శ్వాసల హారంతో అలంకరించుకుంటున్నావే..
ఎంత కరుణయా నీకు నాపై..
కనిపించే దారులన్నీ మూసేసి
ముల్లోకాలకధిపతిని నేనే అంటూ మదిని తిష్టవేసినావే..
ఎంత కరుణయా నీకు నాపై..
అమ్మలగన్నఅమ్మకు పతి అయిన శంకరా
సతికి అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరా..
శివోహం.....శివోహం ..ఓంనమశ్శివాయః ...
నీలమేఘస్వాముని
నీలాల కన్నుల్లో నిలిపుకొని
మగని వలపులతో మురిసి
వికసించిన పద్మంలాంటి మోముపై
నెలవంక చిరునగవయినా...
పున్నమి వెన్నెల కురిపిస్తూ..
ఆ రాముని పతిగా పొందిన సీతమ్మ ...
స్వయంవరాన శివుని విల్లు విరిచినది
చూపరులకయితే...
అంతఃపురం నుండి
జానకి వేసిన చూపుల బాణానికి
తన మనసును తగిలించి ఇచ్చిన వైనం రామునిది..
ఆలుమగల అన్యోన్యతకు ఆదర్శమూర్తులై
జగత్తును రక్షించే ఆ అది దంపతుల అండ
మనకందరకు ఎల్లప్పుడూ ఉండగా ...
దిగులు లేక ఆ రామ నామం స్మరించుకుంటూ
మానసిక శాంతిని పొందుతూ ఉందాము..
శ్రీ రామ... శ్రీ రామ... శ్రీ రామ..!!
ఈ వెన్నెలకి
వన్నె వన్నెల వలపులన్నీ విరుపులై
ఎదగాయాలకు కారణమవుతున్నాయి...
కురులలో ఒదిగి ముద్దులాడుతున్న విరులన్నీ
గుస్ గుసల గోల చేస్తున్నాయి..
స్వప్న లోకాల కలలజలకాలాడు కనులు
విభుని చూపులకై తపిస్తున్నాయి ..
పరువపు పొంగులను దాయను సాయం చేయలేని పైట
చిరుగాలికే రెపరెపలాడుతుంది ...
వేగంగా కొట్టుకుంటున్న గుండెని సమాదానపరచలేక తనువు ..
చేరువగా లేని చెలునికై విరహిస్తుంది ..
మబ్బుల్లో నుంచి కొంటె చందమామ తొంగి తొంగి చూస్తూ...
ఈ అందాలన్నీ ఆబగా తాగేస్తున్నాడు..
అందుకే పున్నమి చంద్రుని నుంచి జాలువారుతూ ..
పుడమంతా పరుచుకున్న ఈ వెన్నెలకి ఇన్ని సొగసులు కామోసు..!!


కన్నీటి చుక్క ...
సుడులు తిరిగిన భాధ 
హృదయాన్ని మధించేస్తూ ఉంటె...
ఒర్చలేని తాపాల ఆవిరి
కన్నీటి చుక్కై...
కంటి చివర చేరి...
వీడిపోలేక వేదన చెందుతుంది....
ఆ చుక్కకున్న మనసు 
కూడా నీకు లేదు నేస్తం...!!
ఒక్క మాట కూడా
చెప్పకుండా...వెళ్ళిపోయావు...
నిర్దయకి మారు రూపం నీవు...
శ్వాసని గాలికొదిలేసి....
నిర్జీవంగా నేనున్నాను...!!
అయోమయస్థితిలో...
కన్ను...
గాజుగోళమే అయింది...!!
బావా..నాయుడు బావా..
నిగ్గులన్ని మూట గట్టి
పరువంతో జతచేసి ..
రెప్పలకింద దాచినానురా..
కంటి రెప్పలకింద దాచినానురా..
బావా..ఓ నాయుడు బావ..
నీవట్టా...కొరకొరా చూడమాకు రా...
బావా..ఓ నాయుడు బావా..!!
కర్రా బిళ్ళా ఆడుతూ ఉంటే..
ఇరిగిన మందారం కొమ్మ చూసి
నే నేడుస్తూ ఉంటే..
ఊరడించ ఆ కొమ్మను
మా ఇంటి ముందు నాటినావే
అప్పుడు..నీకు పదేళ్ళు ఉన్నప్పుడు..
చూడు.. ఇరగబూసే మందారం ఇప్పుడు..
కోసుకొని కొప్పులోన ముడుచుకొంటిరా బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా...
బావా ..నాయుడు బావా..!!
సంతలోన రంగు రంగుల మట్టి గాజులు ..
పట్నం ఎల్లి పట్టుచీర ..కాసులపేరు ..
అట్టు కొచ్చి మా అయ్యను అడుగుతావనుకొంటి ..
“నీ పిల్లను మనువాడుతానని ..”
ముక్కుకు ముక్కెర పెట్టుకొంటి..
నీకిష్టమని చెవులకు జూకాలు తగిలించుకొంటి..బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా ..
బావా ..నాయుడు బావా...!!
నిజం...నిజం..
నీ తలపుల
కలవరింతల కవుగిలింతలచెరలో...
నే బందీనయ్యానే...
మూత పడని కనులకు నేనొక
ప్రశ్నగా మిగిలానే....
చెలీ ..
.నీ నీడలో దాగిననను
ఒక్కసారి చూపులు సారించి చూడు....
నీ.. నిలువెల్లా...నేనవుతా... నీతోడు....
ప్రణయ కలహమిది ...
పోనీలెమ్మనుకున్నా....
ఎదను తన్నినా ...
సత్య కొంగు విడువనికృష్ణయ్య...
మా గురువన్నా....
చెలీ ...
ఒక్కసారి నువు నా
చెంతకు చేరితే...చాలు...
మన వలపు ప్రమిదెలొ వెలిగే దీపం..
ఆరనివ్వ నెన్నటికీ ... ఇది ..నిజం..నిజం..!!.

నీ వేలి కోసలలో నాట్యమాడుతూ
రంగులలో మునకలేసే కుంచె
చివరలతో నాకు మెరుగులు దిద్దుతూ
నీవర్పించిన ఆరాధనాంజలులు ..
నన్ను జీవితురాలిని చేసాయి ..
చిత్రపటంలో నిలువలేని నేను ..
నీకే అర్ధం అయిన ఈ సొగసు
పూ మాలికలతో నిన్ను
అభిషేకించాలనీ...
ఆర్తితో తలపుల తలంబ్రాలు పోస్తూ..
నీకై మిగలాలని....
సంగతులకు తెలియని చీర
కుచ్చిళ్ళ బరువును మోస్తూ..
అడుగు బయటకు వేస్తున్నా...
చెలికానివి నీవేనని నమ్ముతూ...!!
LikeShow More Reactions