7, సెప్టెంబర్ 2017, గురువారం

ఎడారి...
నీ జతలో అడుగులు
వేస్తున్నప్పుడు ఆనందాల
పూదోటలే ఎప్పుడూ...
దారి మరల్చుకొని నీవు
కనిపించని దూరం వెళ్ళిపోయావు ...
ఎడారి అయిన ఈ జీవితం
ఇసుక తిన్నెలు తప్ప
గుక్కెడు నీళ్ళు దొరకక
తపించే...హృదయం...
సూన్యమయిన మనసుకు
మరపు మలాము పూయాలన్నా..
జ్ఞాపకం రెక్కలరెపరెపలలో
ఎప్పుడూ ఉరుముల మెరుపులే..
అయినా..
.శాస్వతమనుకున్న భందం మాత్రం
ఇసుక తుఫానులో చిక్కుకున్న ఎండుటాకే...!!
అర్పణ ...

నీ కనులకు చిక్కిన 
నా చూపులకు ..
కలలన్నీ చిక్కు ముడులై..
కలవర పెడుతున్నాయి..
విడదీసే ప్రయత్నంలో జరుగుతూ..
మనసు జారి...
నీ హృదయ మాళిగ గదిలో పడిపోయింది..
ఆరేసుకుంటున్న కురులతో...
ఆస్వాధనల లేఖలు వ్రాసి పంపుతున్నా...
అగస్యుని ఆశ్రమ నిద్రలకు తిలోదకాలనిచ్చి..
ఒక్కసారి నిన్ను తెలుసుకో ప్రియతమా...!!
హృదయ కవాటాలలోని నా మనసును
జాగ్రత్త చేస్తూ...బదులుగా నీ మనసునివ్వు..
శ్వాస శ్వాసకు నీ పేరే జపిస్తూ...
ప్రతి క్షణం అర్చనల పూజిస్తూ...
నేననే అస్థిత్వం ఆసాంతం నైవేద్యం చేస్తూ..
ఊపిరి ఉన్నంతవరకూ....
అర్పణలోనే జీవిస్తా..ప్రియతమా...!!!




అక్షరాల కెప్పుడు ఆరాటమే 
పదాల పెదవుల్లో నలగాలని ....
వాక్యాల స్థావరం లో స్థిరమవ్వాలని ....
పాటల పల్లకి ఎక్కి ఊరేగాలని ...
కావ్యాలలో కవన ఝరి కావాలని ...
ప్రబంధాలకి ప్రాణమిచ్చి చరిత్ర గా మిగలాలని ...

చీరకట్టు..

భారతీయ సంస్కృతికి వరప్రసాదంగా లభించిన చీర...
అతివల అందాలను తనలో దాచుకుని దాగుడుమూతలాడించేదే చీరకట్టు..
అమ్మాయి అనగానే లక్ష్మీ రూపం కనులముందు ఉంటె..
ఆ దేవతామూర్తులకు అలంకారభూషితమయినది ...చీరకట్టు...
దేశానికి నలుదిక్కుల ఉన్న ప్రాంతాలవారిగా...
వారి వారి అభిరుచికి తగినట్టుగా సింగారాల నెలవైనది చీరకట్టు..
పసిదానికి పసందైనది అయితే....పడుచుదానికి సొగసైనది అయి..
ముగ్ధకు మనోహర రూపమిస్తూ...ముదిత ఆహార్య లాస్యమైనది చీరకట్టు..
చేనేత కార్మికుల అద్భుత కళా సృష్టి ...నేత చీరలయితే..
వేసవిలో ఉపశమనంగా ఉంటూ..మెత్తగా ఒంటినంటి పెట్టుకునేదే..చీరకట్టు..
సాంప్రదాయానికి తగినట్టుగా....పలు రకాల చీరలయితే....
పండుగలలో ఇంతులను పూబంతులుగా మలచేదే చీరకట్టు...
ప్రాంతీయతను ప్రతిబింబింపజేస్తున్నా...పలకరింపులకు స్పందనలై..
కుల మతాలకతీతంగా .....అరమరికలు దూరం చేసేదే చీరకట్టు..
ఆధునికత ఎంతగా ప్రభావితం చేసినా..యువతులకు ...
అమ్మాయితనానికి అర్ధమై ..యువకుల గుండెలకు గాయంచేసేదే చీరకట్టు..
సీతమ్మను సైతం చింతలో పడవేసి..పట్టాభిషేకసమయంలో....
‘ఏం చీర కట్టుకోను స్వామి?..’ అని అడిగింపజేసినదట ఈ చీరకట్టు..
యుగాలు మారినా...శతాభ్దాలు గడిచినా...విదేశీయులకు సైతం
అబ్బురమనిపిస్తూ...చేతులెత్తి నమస్కరింపజేసుకునేదే..చీరకట్టు..!!!
********* **************

ఏసువి నీవు..
పరమేశువి నీవు..
ఫకీరు నీవు...
ప్రకృతిలోని ప్రతి అణువు నీవే...నీవే....
సాయి...ఓం సాయి...
జగతికి జీవం..పోస్తూ..
పర లోకపు సారం తెలుపుతూ..
అజ్ఞానపు చీకటిని తరిమి కొడుతూ..
జ్ఞాన జ్యోతిని మదిన వెలింగిచే..
సద్గురువువు నీవే..నీవే...
సాయి....ఓం సాయి...
మతములకు దొరకని
మహిమవు నీవు..
మహిలో మానవతనే
నిలిపిన మహనీయుడవు నీవు
అయినా,,,నిర్మలమైన రూపంతో..
మసీదు నివాసిగా నిలిచినావు..
నిను తలచేవారి ఎదలో కొలువైనావు...
సాయి...ఓం సాయి...

5, సెప్టెంబర్ 2017, మంగళవారం




వినాయకా..!!

"ఓ బొజ్జ గణపయ్య ...నీ బంటునేనయ్య " అని తలపుల నిలుపుకొని..
బంకమట్టితో..మనసున మెదులు నీ రూపమును తీర్చిదిద్దునునయ్యా వినాయకా .. !
మారేడు జిల్లేడు మొదలగు పరి పరి విదములగు పత్రితో..నీకాసనము వేసి..
గన్నేరు...నందివర్దనం...చేమంతులు...ముద్దబంతులే కాదు...
ఎదలో పూసిన భక్తికుసుమాల..నీకలంకారము చేసి...
ప్రాణ పటిష్ట గావించి...అష్టోత్తర అర్చనలతో...నిను పూజింతునయ్యా వినాయకా..!.
మోదుకలు...ఉండ్రాళ్ళు...గారెలు ..బూరెలు...పరమాన్నాలతో పాటు..
అటుకులు ..కొబ్బరి పలుకులు..బెల్లం కలిపి..నీకు నివేదన చేసేదనయ్యా..
శమంతకమణి కథ చదివి...అక్షతలు తలపై వేసుకొని ..
చంద్రుని చూసిన నిందను బాపుకొనెదనయ్యా వినాయకా.....!
తొలిపూజలు అందుకొంటూ ...విజ్ఞములను తొలగించే గణనాధుడవు...
మరుగుజ్జు రూపమయినా..... బహుసుందరాంగుడవు..
వాడవాడలా కొలువు తీరి...నవరాత్రుల శోభతో భాసిల్లెదవు.
నిమజ్జనము చెంది.. నీటిలో కలిసినా..లోకాల రక్షించువాడవుగదయ్యా.. వినాయకా ..!
.
పర్యావరణ పరిరక్షణగావించుటకు ...సహజసిద్ది గణేషుడను ..
ప్రతి ఇంట నిలపుకొని ..చవితిలోన చల్లగ అర్చించెదరు గదయ్యా ..వినాయకా..!




వచ్చినాడమ్మా..

వెన్నదొంగ..
ఎదలోనె దాగి..
దోబూచు కనులతో..
అటు..ఇటు..చూస్తూ..
పెదవులతో సున్నా చుట్టి..
బూరెలంటి బుగ్గలని ఎర్రగా చేసి..
అడుగుకు..అడుగు కలుపుతూ..
వంచిన బుజాల కుదుపుతూ..
నీలి వర్ణమైనా..
నిగనిగల మెరుపులతో..
మిల..మిలల తళుకులతో..
అలా...అలా...మెల్లగా...
చేరి..వచ్చినాడమ్మా....
ఎనక చేరి రెండు కళ్ళుమూసి..
వెన్నంటిన నోటితో...
ఒక్క ముద్దే ఇచ్చినాడమ్మా...
నా చిన్ని కృష్ణుడు..!