2, జూన్ 2014, సోమవారం

తెలుగు బిడ్డలు



పాండవ మధ్యముడు ..అర్జునుని లక్ష్యసిద్దిని ఆవాసంగా చేసుకొని...
అసేతుహిమాచలం...అవలీలగా అధిరోహించిన తెలుగు బిడ్డలు...
...
మొక్కవోని ధైర్యానికి మారురూపాలై...మంచుపర్వతం మారము చేసినా..
మంచి చేసుకొని మరీ.. గిరి శిఖరాన జెండా పాతిన తెలుగు బిడ్డలు ..
బంజారా బ్రతుకులైనా...గురుకులం శిక్షణలో సాటి లేని వారై..
అట్టడుగునుంచి...ఆకాశపుటంచులను తాకినారు తెలుగు బిడ్డలు ..
ప్రాయంలోనికి కూడా చేరని పసివయసు వారు..అయినా .
ఆపదలు లెక్కచేయక ఆత్మస్థైర్యం చూపినారు తెలుగు బిడ్డలు..
అమ్మాయని అలుసు చూపే లోకానికి ..పరిపూర్ణతని ఇస్తూ..
"మాలావత్ పూర్ణ " తనే ఒక ఎవరెస్ట్ శిఖరం అని చాటింది...
బడుగువారిని బానిసలుగా చూసే...ప్రజలకి ఆచ్చర్యానందాలనిస్తూ..
"ఆనంద్ కుమార్ " తనొక మట్టిలోమాణిక్యం అని తెలియజెప్పాడు..
కలలు కూడా తెలియని కన్నవారికి ..ప్రపంచ ఖ్యాతిని
దోసిట్లో పోస్తూ...విజయ కేతనం ఎగురవేస్తున్నారు...
జాతి గౌరవమే కాదు...దేశ ప్రగతికి సోపానమై..
భావి భవితకు ఆదర్శప్రాయ మయినారు..మన "తెలుగు బిడ్డలు"!!
— with Sujatha Thimmana.
నేనున్నా...


అమ్మ నుంచి
దూరమయిన పసిపాపలా...
చట్టు నుంచి విడివడి .......
గాలిలో ఎగురుతూ వచ్చి
నీటిపై పడ్డానే..
దారి తెలియక..
దిక్కుతోచక చేసే .
నా ఆక్రందనలు
వినిపించుకునే వారే లేరు..

అరచి అరచి అలసిన నాకు...
అలల ఊయల
అమ్మ వాలె లాలిస్తూ..
సాంత్వన నిస్తుంది..
ఆటు పొట్లకు ఎదురితే
జీవితం అని చెపుతూ....
సాగరం అనంతమయినా..
అక్కున చేర్చుకునే నేనున్నా నంటూ...!!.......
ముద్దబంతులు..


.మూగ భావాలను ఎదలో మోస్తూ..
ముచ్చట తీరా నవ్వే..ముద్దబంతులు
...
పండుగలలో తోరణాలై పలకరిస్తాయి..
అలంకరణలలో ప్రధమ స్థానం
తమదే నంటూ భాసిస్తాయి...
కుల..మత..జాతి బేదాలు తెలియనీయక
అందరి ముంగిలిలో..నెలవై కొలువుంటాయి...
పసుపు..ఎరుపు...నారింజ ..రంగురంగులలో..
వికసించే..ఈ ముద్దబంతులు ...
పొడవైన సూది గుండెలో గుచ్చినా..
దారానికి బానిసై...బ్రతుకు పుస్తకంలో
ఒక పెజిగానే ...మిగిలిపోతాయి...
కానీ ...ఎందుకు అని ప్రశ్నించని
పసి ప్రాణాలే...మరి..ఈ ముద్దబంతులు...!!
యోగం.....


‘‘యోగశ్చిత్త వృత్తి నిరోధః’’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ...
జీవాత్మను..పరమాత్మలో చూసుకునే ప్రయత్నమే యోగం..
...
అలవి కాని ఆలోచనల చిక్కు ముడుల జడిలో
ఇరికిన మనసును ...జాగృతి చేస్తూ సాంత్వన పరిచేదే యోగం..
తపశ్శక్తి తో సంతరించుకొన్న సిద్దులను
తమలో దాచుకొనే ఫలాన్ని అందిచేదే యోగం ..
రణగొణ ధ్వనుల కాలుష్యం దరిచేరనివ్వని
సుషుప్తావాస్తని సొంతం చేసేదే యోగం...
భాల భానుడితో ప్రారంబమయిన ఉదయాన్ని
క్రమ బద్దీకరణ చేస్తూ.. జీవితానికి అర్ధం కల్పించేదే..యోగం..
'అభ్యాసంతో సాదించ లేనిది ఏది లేదు' అన్నవాక్యం
అక్షర సత్యం అని నిరూపించేదే...యోగం..
భోగలాలసతను రూపుమాపి ...సంపూర్ణ ఆరోగ్యంతో పాటు
స్వార్ధరహిత మానవీయతను అందించేదే...యోగం..
వేదాలలో..భాగమై..ఇతిహాల సంస్కృతికి అద్దం పడుతూ..
దేశదేశాలలో...భారతీయతను భవిష్యత్తు రధాలలోనడిపిస్తుంది యోగం..!!
ఎడారి...
నీ జతలో అడుగులు
వేస్తున్నప్పుడు ఆనందాల
పూదోటలే ఎప్పుడూ...
...
దారి మరల్చుకొని నీవు
కనిపించని దూరం వెళ్ళిపోయావు ...
ఎడారి అయిన ఈ జీవితం
ఇసుక తిన్నెలు తప్ప
గుక్కెడు నీళ్ళు దొరకక
తపించే...హృదయం...
సూన్యమయిన మనసుకు
మరపు మలాము పూయాలన్నా..
జ్ఞాపకం రెక్కలరెపరెపలలో
ఎప్పుడూ ఉరుముల మెరుపులే..
అయినా..
.శాస్వతమనుకున్న భందం మాత్రం
ఇసుక తుఫానులో చిక్కుకున్న ఎండుటాకే...!!
See More

18, మే 2014, ఆదివారం

నేటి విద్యార్ధి...

.............................................
'అ' అమ్మ...'ఆ' ఆవు...
కావు..కావు...అవి...వట్టి కాకి గోలలు...
అంటూ...చెవులు మూసుకునే..
నేటి విద్యార్ధి...

'బడి' అంటే...ఏంటి...?
ఓ.......యు మీన్..స్కూల్..!
బర్రెలుకట్టేసే చోటనుకున్నాననే ...
నేటి విద్యార్ధి...

'గురువు' కు నమస్కారం  పెట్టె...
సంస్కారం పోయి...
'మాం' కి మస్కా కొట్టే...
నేటి విధ్యార్ది..

'మాతృభాష ' లోని మాతృకను మృతిచేసి
కాన్సెప్ట్ కవ్వింతలకు..కలల సౌధం గుచ్చేసి
మసిబారిన ముసుగుబస్తాల
బరువును మోసే..నేటి విద్యార్ధి...

3, మే 2014, శనివారం

శ్రామికుడు ...


....................................................................................
దేశానికి వెన్నెముక కర్శకుడైతే....ఆ వెన్నును పట్టుకొని ఉండే ' మనిషి '
అనే యంత్రాన్ని అన్నివిదాలా కాపాడేందుకు  కష్టం చేసే  వాడే ...కార్మికుడు....
రక్తాన్ని చెమటగా స్రవించి ..నిరంతరం విశ్రాంతి ఎరుగక
పని ఒక్కటే...పరమాత్మ స్వరూపంగా భావించే బడుగు జీవితడు ...

శ్రమను దోచుకునే యాజమాన్యాలకు ఎదురు నిలవలేని ఆసక్తుడయినా
ఆకలి కేకల కడుపులకు జవాబు చెప్ప యునియన్లని ఏర్పరుచుకున్నాడు...
భిగించిన పిడికిలితో....నాయకుని నినదిస్తూ....తమ హక్కులకై..
పోరాటం సాగిస్తూనే ఉంటున్నాడు...అయినా తరగని సమస్యలు...వీడని చిక్కులు..

ప్రతి మనిషి ఓ శ్రామికుడే...అన్న నిజం తెలుసుకోలేక మనిషి మృగమవుతున్నాడు..
ప్రజాస్వామ్య వ్యవస్తలో...రాజకీయపు స్వార్ధంలో నలిగి మలిగిపోతున్నాడు...
కుల..మత..వర్గ..బేదాలు తెలియని పనికి...తన శ్రమను అంకితమివ్వాలని ఉన్నా..
వాటి స్థానే....కరుడు కట్టిన కక్షలకు బలిపశువు అవుతున్నాడు...

కడుపు చీల్చిన కన్నతల్లి రొమ్ము గుద్ది పాలు త్రాగినవాడు...
అడుగులు వేసినప్పటి నుంచి ఆ అమ్మ శ్రమని కర్పూరంలా హరించినవాడు..
ఆమె  అడుగులు వేయలేని స్థితి లో...వీది గుమ్మం పాల్జేసే ..వాడు...
' మే ' డే ల పేరిట శ్రామిక దినం చేసుకునేనుందుకు అర్హుడు కానేకాడు...

' నేను సైతం ' అన్న శ్రీ శ్రీ గారి కలంలోని కవితలా ...ప్రతి వ్యక్తీ...
ఓ శ్రామిక శక్తి అయిన నాడు...ప్రపంచ శాంతి సమక్యమై దేదీప్యమవుతుంది..!!