27, జనవరి 2014, సోమవారం

తీర్పు...


నీ కనులు చెప్పిన ఊసులకు 
నా రెప్పలు సాక్ష్యం ..

నీ ఎద చేసిన బాసలకు 
నా మనసు సాక్ష్యం....

నీ పెదవులు పలికిన మాటలను
లిఖించుకున్న నా హృదయమే సాక్ష్యం.

నీ కదలి పోయిన అడుగులకు 
చితికిన నా బ్రతుకే సాక్ష్యం ...

నీ అంతరాత్మ న్యాయస్థానంలో...
అపరాదివి నీవు.... 

సాక్ష్యాలను కూడదీసుకొని 
వాదిస్తా...న్యాయవాదినై...

న్యాయమూర్తైన ప్రేమ గారి 
తీర్పు ఎటువైపు ఉంటుందో..మరి..
నాన్న !!

అమ్మ పాలు త్రాగి 
ఆకలి తీర్చుకున్నా..
నాన్న అనురాగాల లాలనలలో...
అన్నీ మరచి జీవించా......

చట్టి తల్లినైన నన్ను గాల్లొకెగరేస్తూ...
నా కిల కిల నవ్వుల్లో
తన వయసును మరచి 
నా అల్లరిలో పాలు పంచుకున్న నాన్న!

అడుగు..అడుగు కూ 
తన అరచేయి ఉంచి
తడబడు అడుగులను 
తప్పటడుగులు కానివ్వని నాన్న!

అ ఆ లు దిద్దిస్తూ......
నాకు తోలి గురువై 
అహర్నిశలు నా ఉన్నతిని కాంక్షిస్తూ
ఆత్మా స్తైర్యం నింపిన నాన్న!

ఎదిగిన నన్ను చూసి 
ఆడపిల్లనని గుర్తెరిగి 
తప్పక అప్పగింతలు చేసి 
కనుపాపల వెనుక ...
కంటి చెలమను దాచి ..
పంటి బిగువును ..
మీసాల పక్కకు నెట్టి
ఆలింగనంతో అభయ హస్తమిస్తూ 
వీడ్కోలు చెప్పిన నాన్న!

నా కంటి పొరల వెనుకే గానీ...
కనుల ముందుకు రాలేని 
లోకాలకు సాగిపోయే...నాన్న!

నేనాడపిల్లనే...చివరికి...
చితి పెట్టను కూడా..
పనికిరాకపోతినే....
నాన్నా....!!!

(సరిగ్గా...ఏడు సంవత్సారా ల క్రితం ఇదే రోజున నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు...అశ్రుతర్పిత నయనాలతో...)...

బలపాల రాతలే…
మద్యతరగతి మహిళ జీవితం

స్పందలను రాస్తూ…
చెరిపేస్తూ…
ఊహలను ఉమ్మెత్తలో కలిపేస్తూ…
తాళిని దాటనివ్వని తలపులకు
తాళం వేస్తూ…
మెట్టెల కాళ్ళతో మెట్టినింటి బరువును మోస్తూ…
మగని అహంకారపు కొరడాలని భరిస్తూ….
కన్నవారి కనుదోయిని
కరగనివ్వకూడదని తలపోస్తూ…

మహిలో మణిపూసైనా… మట్టిరవ్వగానే బ్రమిస్తూ….
వయసుడికి వార్ధక్యం చేరినా…
‘ఓ మహిళ ‘ గా ఎదగలేని తను
వాక్యాలకందని అక్షరాన్నని తనని తను తెలియజేస్తూన్న…
మద్యతరగతి మహిళ జీవితం…
బలపాల రాతలే….

- సుజాత తిమ్మన

- See more at: http://vihanga.com/?p=10213#sthash.E9WUdHUB.dpuf
ఎందుకమ్మ.....!!

తల్లీ గోదారి....
నీకెందుకమ్మ
నేనంటే ఇంత ప్రేమ....
కృష్ణమ్మతో కలిసి
పరాడుతూ....
సముద్రం లో కలవకుండా...
నా హృదయ సంద్రం
చేరా వెందు కమ్మా...

మీ చేరిక తో....
వేదనల అగ్నిపర్వతం
బద్దలై....
సునామీ సృష్టిస్తుందే...
ఉబుకుతూ మీరు
హృదయకవాటాలను
చేదించుకొని....
కనుల దారులను
ముంచేస్తూ.....
వెచ్చగా...చెంపలను
చెలమలను 
చేస్తుంటి రే.... 

మీ ఆప్యాయతాలింగనంలో
నే నావిరై పోనా.....!

స్పటికమ్ లాంటి
స్వచ్చ మైన మీరు
ఉప్పు నీటి 
పరమైనారని....
మరింత కన్నీరు
కార్చనా......!!!

పాపం.....!!!

మనుషులను విడిచిన మానవత్వం
ఎగురుకుంటూ ఎగురుకుంటూ....
వినువీది ని చేరి
మేగాలను తాకి .....
గర్షణ కలిగించింది...
ఆ ఘర్షణల వరవడి లో....
రాలుతున్న చినుకులు 
తుఫాను గా మారి 
జన జీవనాన్ని 
అతలాకుతలం చేస్తున్నాయి....

వెలుగుతో పాటు
మండే ఎండను పంచే 
సూర్యుడు సైతం 
మిన్నకున్నాడు 
ఈ భీభత్సవాన్ని చూస్తూ....

పండిన పంటలు 
వరదల్లో కొట్టుకు పోతున్నాయి 

ఏపుగా ఎదిగిన పైరు
నీట మునిగి నిర్జీవమౌతుంది....

కన్నీటి సునామీలు
కర్షకుల కళ్ళల్లో....

గుండెపోట్ల దాడీలు 
ముంగిళ్ళకి చేరువలో....

షావుకార్లు లేని
సరుకుల బజారుల్లో
కాలుతున్న కరీదె...
ప్రతీ వస్తువు...
సామాన్యుడు తాకడానికి 
బయపడే జ్వాలాముఖే...

దానికి తోడు 
కాలుతున్న కడుపు 
మర్మం తెలియక 
డొక్కల నెగరవేస్తూ...
చప్పుడు చేస్తుండే....
పేద వాడి బ్రతుకు ...

తమ తప్పు లేకుండా 
రాజకీయ రాబందులు 
ఆ డొక్కల చీల్చి చెండాడుతూండే...

ప్రకృతి మాత్రం 
ఏంచేస్తుంది.....
పాపం.....!!

శివ సాన్నిద్యము చేర 
లింగాభిషేకము చేయ
గంగ నీరు తేవ...
పోతుంటే...
గట్టు దాటనైతినే ...

విషయ మెరుగని 
మనసు విఖల మై 
విరక్తి చెంద ...
హృదయమున కురికొచ్చింది...
పరుగు పరుగు న 
పావన గంగమ్మ తల్లి ...
కంటి దారుల 
దుమికేనయ్యా..శివయ్యా...
నీ కభిషేకము చేయ ...

ఒక మంత్రం పుష్పం...


ఒక మంత్రం పుష్పం....
నీకు సమర్పించ 
విశ్వమంత గాలించా...
సుక్ష్మ రూపినై....

ఎద పొద లోనే పూసింది...
నీ ధ్యాన సుగంధాల రేకులతో...
ఎరుగక నేను...
వెతికి వెతికి...వేసారితిని...

నే..అలసి.. సోలసినా గానీ...
వాడనీయక ఈ సుమాన్ని..
నీ పాదాల చేర్చాలనీ..
తపనతో..నీ ఎదుటనే నిలిచితినీ....
శ్రీ వెంకటేశ్వరా....శ్రీ శ్రీనివాసా....